కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం: వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండలకేంద్రంలో డీసీఎంఎస్ సెంటర్లో జీలుగ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో జడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి మాట్లాడుతూ, మండలంలో ప్రతి డిసిఎంఎస్ సెంటర్లో జీలుగా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వరి కోత అనంతరం తడి పొలంలో జీలుగ విత్తనాలు వెదజల్లినాక 45 రోజుల తర్వాత కలియదున్నాలని సూచించారు, ఇలా చేయటం వల్ల భూమిలో నత్రజని శాతం పెరుగుతుందని మరియు భూసారం పెరుగుతుందని తెలిపారు, తద్వారా పంట యొక్క దిగుబడి కూడా పెరుగుతుందని చెప్పారు. ఒక జీలుగా బస్తాకు ఖరీదు 843 రూపాయలు. 30 కేజీల బ్యాగ్ రెండు ఎకరాలకి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ న్యాత స్వప్న సుధాకర్, గన్నేరువరం ఉప సర్పంచ్ బూర వెంకటేష్, రైతుబంధు జిల్లా మెంబర్ గొల్లపల్లి రవి, రైతుబంధు విలేజ్ కోఆర్డినేటర్ కాంతాల కిషన్ రెడ్డి, డీసీఎంఎస్ భూమాడి శ్రీధర్ రెడ్డి, ఏఈఓ సౌమ్య. రైతులు పాల్గొన్నారు.