హైదరాబాద్ రాజుమొహల్లా నారాయణగూడ లో గల పద్మశాలి భవన్ నందు అఖిల భారత పద్మశాలి సంఘం అనుబంధంగా తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శిగా చెన్న రవికుమార్ నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు మచ్చ ప్రభాకర్ రావు అఖిలభారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు. గత కార్యవర్గ లో సహాయ కార్యదర్శిగా ఉన్న చెన్న రవికుమార్ ని ఇప్పుడు కార్యదర్శిగా ప్రమోషన్ ఇచ్చి పద్మశాలి కులానికి అభ్యున్నతికి, సంక్షేమానికి పాటుపడాలని వారు సూచించారు. సంఘానికి చెన్న రవికుమార్ సేవలను గుర్తించి నియామక పత్రం ఇచ్చారు. నియమితులైన చెన్న రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 30 లక్షలు ఉన్న పద్మశాలి సంఘం అభివృద్ధి కి అన్ని రంగంలో కృషి చేస్తానని తెలియజేశారు. అదేవిధంగా అఖిలభారత పద్మశాలి సంఘం శాశ్వత సభ్యత్వం పదివేల రూపాయలు చెల్లించి సభ్యత్వం చెన్న రవికుమార్ తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో అఖిలభారత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి కమర్తపు మురళి, యువజన విభాగం అధ్యక్షులు బండారి శ్రీనివాస్, మహిళా విభాగం అధ్యక్షురాలు సునీత మరియు ఆర్మూర్ పద్మశాలి సంక్షేమ సేవ వ్యవస్థాపక అధ్యక్షులు మ్యాక మోహన్ దాస్, వేముల ప్రకాష్ ,అందే నాగేశ్వరరావు మరియు జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
