- హుకుంపేటలో ఆగన శిశు మరణాలు
- సత్పాలితాలు ఇవ్వని ఆరోగ్య సమీక్షా, సమావేశాలు
- కలెక్టర్ ఆదేశాలను భేఖాతరు చేస్తున్న వైద్య సిబ్బంది
అల్లూరి జిల్లా హుకుంపేట: మండల కేంద్రాల్లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కూతవేటూదూరంలో బుధవారం రేండు నెలల శిశువు మృత్యువాత పడ్డారు. మండల కేంద్రంలో పరిధిలో దాలిగుమ్మడి గ్రామంలో సమరెడ్డి వేంకట రావు, వెంటలక్ష్మీ దంపతులు ద్వితీయ కుమార్తె పుట్టి రేండు నేల పాప చిన్నారి తీవ్రమైన కడుపునొప్పి మరియు వాంతులు సక్రమంచి ఆకస్మికంగా మృతి చెందింది. గతకొద్ది రోజులుగా మండలంలో మట్టు జోరు పంచాయతీ గ్రామంలో
తుర్రే బాలకృష్ణ,వసంత, దంపతులు పుట్టి మూడు నెలల పాప మృతి చెందింది.ఆగని శిశువు మరణాలలు రోజు రోజుకి ఎక్కడో ఒక చోట మణాలు జరుగుతూనే ఉన్నాయి ఏజెన్సీ వ్యాప్తంగా చూసుకుంటే హుకుంపేట మండలం లోని అధికంగా శిశువు మరణాలు జరుగుతుంది. జిల్లా వైద్య అధికారులు నిలుపుదలకు చర్యలు చేపడుతున్నా గాని అంతు చిక్కని రాక రకాల వ్యాధులతో ఎదో రుపురంలో పసిపిల్లలకు మరణం వెంటాడుతూనే ఉన్నాయి. గత నెల ఏపీల్ 5తేదీన మండలం కేంద్ర లోనే బడ్నైని నీలకంఠ చిన్నారి దంపతులకు పుట్టిన చిన్నారి తీవ్రమైన కడుపునొప్పి మరియు ఊపిరి సక్రమంగా ఆకస్మికంగా మృతి చెందాడు. అదే కుటుంబానికి చెందిన తన సోదరుడైన బిసాయి కుటుంబానికి జన్మించిన మరొక శిశువు గత మూడు నెలల కిందట మృత్యువాత పడడం గమనార్హం. మండల పరిధిలో ఐదు రోజుల వ్యవధిలో సుమారు ఐదు మంది పసిపిల్లలు మృత్యువాత పడడం గమనార్హం. ఈ శిశు మరణాలపై అడ్డుకట్ట వేసేందుకు కలెక్టర్ సైతం అనేక చర్యలు చేపడుతున్నామని చిన్నారుల మరణాలపై సంబంధిత అధికారులను బాధ్యులు చేస్తూ చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్న అవి ప్రకటనలకే పరిమితంగా మారిందని పలువురు విమర్శిస్తున్నారు. గిరిజన ప్రాంతంలో ఎక్కువ శిశుమరణాలు సంభవి స్తున్నాయని మైదాన ప్రాంతాలలో శిశు మరణాలు ఎందుకు తక్కువగా ఉంటుందని ఇది అధికారుల పర్యవేక్షణ లోపమా లేక కుటుంబ సభ్యులు నిర్లక్ష్యమా అర్థం కావడం లేదు. శిశు మరణాలపై అధికారులు ప్రత్యేక అధ్యయనాలు చేసి శిశు మరణాల అరికట్టేందుకు ప్రత్యేక ఆసుపత్రిలు నెలకొల్పి ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని తల్లితండ్రులు కోరుతున్నారు