సిద్దిపేట జిల్లా : బెజ్జంకి మండలంలోని నరసింహులపల్లి గ్రామాన్ని సంసాద్ ఆదర్శ గ్రామపంచాయతీ యోజనలో భాగంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ దత్తత తీసుకోవడం జరిగింది, అభివృద్ధి పనుల పరిశీలనలో భాగంగా శుక్రవారం బెజ్జంకి మండల బిజెపి పార్టీ అధ్యక్షులు దోనె అశోక్ ఆధ్వర్యంలో పనులు పరిశీలించి గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, ఉప సర్పంచులను బిజెపి రాష్ట్ర నాయకులు సొల్లుఅజయ్ వర్మ, కిషన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మైపాల్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా మైపాల్ రెడ్డి మాట్లాడుతూ సంసత్ ఆదర్శ గ్రామంగా నరసింహులపల్లిను ఎంపిక చేసి రాజకీయాలకతీతంగా ఎంపీ బండి సంజయ్ అభివృద్ధికి కృషి చేయడం శుభ పరిణామం అన్నారు. గ్రామాల అభివృద్ధికి రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు తమ వంతు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో నరసింహులపల్లి గ్రామపంచాయతీ నిర్మల్ పురస్కార్ అవార్డు అందుకోవాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలోగ్రామ ప్రజలు,బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.