సిద్దిపేట జిల్లా: బెజ్జంకి మండలంలోని వడ్లూరు గ్రామాన్ని ప్రత్యేక రెవెన్యూ గ్రామంగా గుర్తించాలని శుక్రవారం సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో సిద్దిపేట జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ కి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు, ఈ సందర్భంగా ఆర్ టి ఐ ప్రచార కమిటీ చైర్మన్ దళిత రత్న అవార్డు గ్రహీత రా సూరి మల్లికార్జున్ మాట్లాడుతూ గతంలో వడ్లూరు బేగంపేట్ ఒకే గ్రామంగా ఉండేది కానీ గత 25 సంవత్సరాల క్రితమే రెండు గ్రామాలు వేరువేరు గ్రామపంచాయతీలుగా విడిపోయినప్పటికీ ఇప్పటికి కూడా ఒకే రెవెన్యూ గ్రామంగా అధికారిక కార్యకలాపాల్లో నమోదు కావడం వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధుల విషయంలో మా వడ్లూరు గ్రామానికి నష్టం వాటిల్లుతుందని వివరించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వడ్లూరు గ్రామాన్ని ప్రత్యేక రెవెన్యూ గ్రామంగా గుర్తించాలని విజ్ఞాపన పత్రాన్ని గ్రామ ప్రజలతో కలిసి జాయింట్ కలెక్టర్ గారికి సమర్పించినట్లువివరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ సింగిరెడ్డి తిరుపతిరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ పులిశ్రీనివాస్, రెడ్డి సంఘం రాష్ట్ర నాయకులు చిన్నాడి సుధాకర్ రెడ్డి, వివిధ సంఘాల నాయకులు మంకాల ప్రవీణ్ కుమార్, పులి రమేష్, కాసాని కరుణ తదితరులు పాల్గొన్నారు.