- నేను ఏటువంటి ఆక్రమణలకు పాల్పడలేదు
- మాకు సంబంధించిన వారు రెవెన్యూ చట్టప్రకారమే 2093 సర్వే నంబర్లో భూములు పొందారు..
- మా ఎదుగుదలను ఓర్వలేకనే నా కుటుంబం పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు.
- భూ ఆక్రమణలకు పాల్పడుంటే..అధికారులు చట్ట ప్రకారం చర్యలు తీసుకొనేవారు.
- నా ప్రతిష్టకు భంగం కలిగించే వారిపై న్యాయ పోరాటం చేస్తా
- చట్టాన్ని తప్పు దోవపట్టించేవారికి గుణపాఠం తప్పదు..
- మాజీ సర్పంచ్ ఏనుగుల శేషయ్య
అన్నమయ్య జిల్లా,
ఓబులవారి పల్లె మండలం,చిన్నంపల్లి పంచాయతీ- మే-20: తాను గానీ..,తనకి సంబంధించిన వారు గానీ దేవాలయ భూములు , స్మశానవాటిక భూములను అక్రమించలేదన్నారు మాజీ సర్పంచ్ ఏనుగుల శేషయ్య. రెవెన్యూ చట్ట ప్రకారమే భూములు పొందారని తెలిపారు. ఎక్కడా భూ ఆక్రమణ పాల్పడలేదని స్పష్టం చేశారు. ఒకవేళ తాను భూ కబ్జాకు పాల్పడి ఉంటే తనపై తీసుకొనేఎలాంటి చర్యలకైనా తాను సిద్ధమని స్పష్టం చేశారాయన. కొందరు ఓర్వలేకనే తమ కుటుంబం పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారనీ.., మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలపై శేషయ్య స్పందించారు. తాను ఐదేళ్లపాటు చిన్నంపల్లి పంచాయతీకి సర్పంచిగా పనిచేశారని తెలిపారు.ఆ సమయంలో పదవిని అడ్డుపెట్టుకొని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడలేదన్నారు. మరి ముఖ్యంగా ఎక్కడ భూ ఆక్రమణలకు పాల్పడలేదన్నారు. అయితే తన స్వగ్రామం లింగిరెడ్డిపల్లికి చెందిన కొందరు తన ఎదుగుదల చూసి ఓర్వలేక, భూ ఆక్రమణకు పాల్పడ్డానంటూ ఆరోపణలు చేస్తూ.. బురదజల్లే ప్రయత్నం చేయడం శోచనీయమన్నారు. అంతటితో ఆగని తమ గ్రామ వాసులు, ఏకంగా రెవెన్యూ అధికారులకు తప్పుడు సమాచరాన్ని ఇస్తూ తాను తప్పు చేశానని పదే పదే ప్రచారం చేయడం అర్థ రహితమన్నారు. చట్టాలపై తనకు గౌరవం ఉందని, అందుకే రెవెన్యూ అధికారులను న్యాయస్థానాన్ని గౌరవించానన్నారు. ఎక్కడా పొరపాటు జరగలేదు కాబట్టే.., అధికారులు తమ విన్నపాన్ని మన్నించారని చెప్పారు. తాను సర్పంచిగా పనిచేసిన సమయంలో కూడా పంచాయితీ అభివృద్ధే లక్ష్యంగా పనిచేశానని గుర్తు చేశారు. అటువంటి తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా తమ గ్రామ వాసులు వ్యవహరించడం ఆక్షేపనీయమన్నారు. తనకు సంబంధించిన వారు ఎక్కడ కూడా దేవాదాయా , స్మశాన వాటికకు చెందిన భూములను అన్యాక్రాంతం చేయలేదన్నారు.
తమవారు పొందిన భూములన్నీ ఎప్పుడో ఆన్లైన్ అయ్యాయన్నారు. అలాగే వాటికి సంబంధించి, పట్టాదారు పాసు బుక్కులు కూడా తమవారు పొందారన్నారు మాజీ సర్పంచ్ ఏనుగుల శేషయ్య. కానీ.., ఇవన్నీ తెలిసి కూడా తమ గ్రామంలోని కొందరు.., కక్ష సాధింపులతో తనను మానసికంగా, శారీరకంగా, సామాజికంగా, రాజకీయంగా.., ఆర్థికపరంగా వేధింపులకు గురి చేయడంలోని ఆంతర్యమేమిటో అర్థంకావడం లేదన్నారు. తన ప్రతిష్టకు భంగం కలిగించే వారిపై
న్యాయ పోరాటం చేస్తానని చెప్పిన శేషయ్య..,చట్టాన్ని తప్పు దోవపట్టించేవారికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఇకపోతే రెవిన్యూ చట్టాలను, న్యాయస్థానాన్ని పక్కదారి పట్టించే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకునే తనను ఇలా ఇబ్బందులకు గురి చేస్తే.. ఉపేక్షించబోనని, తన ప్రతిష్టకూ భంగం కలిగించేవిధంగా వ్యవహరించే వారిపై పరువునష్టం దావా వేస్తాననీ మాజీ సర్పంచ్
హెచ్చరించారు.