- మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ ఎమ్మెల్యే భూమా పై ఫైర్ అయిన మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నిసా..
నంద్యాల : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్రజాస్వామిక, అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తూ పేద,బడుగు, బలహీన వర్గాల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యానించడం తగదని, ఎంతో దారుణమని చంద్ర బాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నమని మున్సిపల్ చైర్ పర్సన్ మా బన్నీసా పేర్కొన్నారు. పేదలకు ఇళ్లిస్తే సామాజిక అసమానత్వంమని,స్మశానాలతో పోల్చడం దురదృష్టకరం అన్నారు. చంద్ర బాబు నాయుడు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ శనివారం స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి గృహం నుండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకుల ఆధ్వర్యంలో శ్రీనివాస సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మా భున్నిసా మాట్లాడుతూ పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక అసమానత్వం వస్తుందని, పేదలకు పంపిణీ చేసే సెంటు స్థలాన్ని స్మశానాలతో పోల్చడం చంద్రబాబు నాయుడు దురహంకారానికి నిదర్శనం అన్నారు. చంద్ర బాబు వ్యాఖ్యలు ఇది ఎంతో దురదృష్టకరమన్నారు. చంద్రబాబు నాయుడు అహంకారపూరిత వ్యాఖ్యలు చేయడం తగదు అన్నారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల సొంతింటి కల నెరవేరుస్తూ ఇళ్లస్థలాలను పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు మాటలు కుల అహంకారం పెత్తందారీ మనస్తత్వానికి ప్రతిక అని మండిపడ్డారు. పేదలకు అందించే ఒక సెంటు భూమి స్మశానంలా కనబడుతుందని చెప్పడం పేద, బడుగు, బహీన వర్గాలను కించపరిచినట్లే అన్నారు. పేదల కష్టాలు కలలు చంద్రబాబునాయుడు తెలుసుకోవాలన్నారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వ లేక కుట్రలు, కుతంత్రాలు చేస్తూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల మనోభావాలను కించపరుస్తూ వ్యాఖ్యానించడం ఎంతో దారుణం అన్నారు. పేదల ఓటు బ్యాంకు కోసం రాజకీయాలు చేస్తూ, అధికారం వచ్చిన తర్వాత వారి సంక్షేమం పట్టించుకోకుండా అవమానించడం తగదన్నారు. రాబోవు కాలంలో పేద, బడుగు బలహీనవర్గాలు చంద్రబాబు నాయుడును అదే స్మశానంలో నిలబెడతారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దృశ్య కళల డైరెక్టర్ సునీత అమృతరాజ్, ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ డాక్టర్ శశికళ రెడ్డి, బెస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు, వైఎస్ఆర్సిపి నాయకులు, ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీ వర్గాల నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.