చిత్ర పరిశ్రమలో అలనాటి నటి రాధికా గురించి తెలియని వారంటూ ఉండరు. చూడటానికి ఎంతో హుందాగా కనిపించే రాధికా జీవితంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాధికా ముగ్గురిని పెళ్లి చేసుకుంది. అయితే ఆమె మొదట 1985 సంవత్సరంలో నటుడు, క్రియేటర్, దర్శక నిర్మాత అయినా ప్రతాప్ పోతన్ ని వివాహం చేసుకున్నారు. ప్రతాప్ పోతన్ బాగా డబ్బు ఉన్న వ్యక్తి ఒక క్రియేటివ్ అలానే చాలా మంచివాడు అని భావించి రాధికా పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లి తరువాత అసలు రంగు బయటపెట్టడంతో ఇద్దరు విడిపోయారు. అయితే ఇద్దరు విడాకులు తరువాత ప్రతాప్ రాధికా వ్యక్తిగతం గురించి ప్రెస్ మీట్ పెట్టి మరీ రాధికా అలాంటిది ఎలాంటిది అని అంటూ మీడియా ముందు రాధికా గురించి చేదుగా చెప్పడానికి ప్రయత్నించారు. కానీ రాధికా మాత్రం తన గురించి తన భర్త ప్రతాప్ ఇంత చేదుగా చెప్తున్నా కానీ ఒక మాట కూడా తన భర్త గురించి చేదుగా చెప్పలేదు అంటే రాధికా వ్యక్తిత్వం ఏంటో ఇక్కడే అర్ధం అవుతుంది. అలాగే వీరిద్దరూ విడిపోయాక రాధికా తన సినీ జీవితం మీద ప్రభావం పడనీయకుండా సినిమాలో నటిస్తూనే ఉంది. ఆ తరువాత రాధికా ఒక బ్రిటన్ దేశస్తుడు అయినా రిచర్డ్ హార్డీని పెళ్లి చేసుకుంది. ఇక వీరిద్దరి మధ్య వైవాహిక జీవితం ఎన్ని రోజులు కొనసాగలేదు. అయితే ఆ పెళ్లి జీవితంలో చేసిన అతి పెద్ద తప్పుగా రాధికా ఇప్పటికి చెబుతూనే ఉంది. కానీ.. బాధని ఎలా అర్ధం చేసుకోవాలనే విష్యం అతనికి తెలీదు ఆ విషయం తెలుసుకునే సమయానికి రాధికా అష్టి సగ భాగం వరకు కోలుపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఆమె వీరిద్దరి మధ్య బంధం తెగిపోయింది. ఇక ఆమె తమిళ నటుడు శరత్ కుమార్ ని పెళ్లి చేసుకుంది. ఆమె ప్రస్తుతం వైవాహిక జీవితం సంతోషంగా గడుపుతుంది.