విజయపురి సౌత్: జిల్లా ఎస్పీ రవి శంకర్ రెడ్డి ఆదేశాలతో శనివారం రాత్రి మాచర్ల మండలం చింతల తండా గ్రామంలో విజయపురి సౌత్ ఎస్ ఐ పి అనిల్ కుమార్ రెడ్డి పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలు ప్రశాంతంగా మెలగాలన్నారు. ఘర్షణలకు పాల్పడకుండా స్నేహ భావం తో ఉండాలని కోరారు.ఏవైనా సమస్యలు ఉంటే పోలీసులను సంప్రదించాలని కోరారు.కార్యక్రమంలో ఏఎస్ఐ మస్తాన్ వలి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.