- హుకుంపేట పంచాయితీలో లోపించిన పారిశుధ్యం
- నానాఇక్కట్లు పడుతున్న గిరిజనం
- పత్రికలలో వచ్చిన కథనాలపై లెక్క చేయని అధికారులు, సిబ్బంది
అల్లూరి జిల్లా, హుకుంపేట: జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న హుకుం పేట మండల కేంద్రంలో డ్రెయినేజీ కాలువలు ఉన్న చెత్త చెదారాన్ని దుకాణదారులు తొలగించక పోవడం ఎక్కడకక్కడే చెత్త పెరిగిపోయి దుర్వాసన వలన దోమలు బెడద వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు . మురికి నీరు స్టోరేజ్ వల్ల క్రీమీ కీటకాలు బారిన పడి విషజ్వారాలకు గురౌతున్నారు . నెలకి రెండు సార్లు దోమల నివారణకు మందు చల్లాలని. కానీ ఏడాది అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు . చెత్త చెదారం మురికి నీరు నిలవ వుండటం వలన దీని నుండి వచ్చే దుర్వాసన , మురికి నీరు వలన క్రీమీకీటకాలు అధిక సంఖ్యలో పెరిగడంతో పలు రకరకాల వ్యాధులు విష జ్వారాలు బారిన పడి గిరిజనులు పలు సమస్యలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇప్పటికైనా
పంచాయితీ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు