రాజన్న సిరిసిల్ల జిల్లా: ఇల్లంతకుంట మండలంలో వడ్లు కొనుగోలు సెంటర్లో నెల రోజులైనా కంటలు వేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నా ఈ తెలంగాణా ప్రభుత్వం తీరు మారాలని మండల భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా నాయకుడు మామిడి హరీష్ అన్నారు. ఆయన మాట్లాడతూ రైతులు వరి పంటలు వేసి కోత కొచ్చే సమయానికి అకాల వర్షలకు పంటలు సగం రాలిపోయిన మిగిలిన సగం పంటలు కోసి వడ్లు కొనుగోలు సెంటరల్లో తెచ్చి పోస్తే నెల రోజులైనా కంటలు వేయకుండా రైతులను బాధ పెడ్తున్న నియోజకవర్గ ఎమ్మెల్యే పట్టించుకోకుండా రైస్ మిల్లర్ల ఇచ్చే కమిషన్లకు ఆశపడి రైతుల నుండి కింటాలకు 5 కిలోల దోపిడీ చేయడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికేనా ఎమ్మెల్యే దోపిడీ అపి రైతుల వడ్లు సంచికి 41 కిలో కంటలు వేయాలనిట్ వెంటనే కంటలు ప్రారంభించాలని ఎమ్మెల్యే ని డిమాండ్ చేస్తున్నామాంన్నారు, కంటలు వేయకపోతే ఈ దోపిడీ అప్పకపొతే రానున్న ఎన్నికళ్ళలో ఎమ్మెల్యే రసమయి ని ఎన్నికలు గుణపాఠం చెప్తామని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బత్తిని.స్వామి, బొల్లారం. ప్రసన్న, బెంద్రం. తిరుపతి రెడ్డి,దండవేణి. రజినీకాంత్, పొట్ల.వెంకటేష్, దురుముట్ల.ప్రశాంత్, ఎలుక. వర్ధన్, అనిల్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.