- యాజమాన్య హక్కులు కల్పించి, క్రయవిక్రయాలకు అవకాశం కల్పించాలి…
- పిల్లలు పెళ్లిళ్లు, చదువులు కోసం ఒకరిపై ఆధారపడకూడదు…
- అవినీతి, అసమర్థ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపుదాం…
- “మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని” కార్యక్రమంలో “పులివర్తి నాని”
తిరుపతి, మే-25: తిరుపతి రూరల్ మండలం, పేరూరు పంచాయితీ, హరిపురం కాలనీలో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న స్థానికులకు పట్టాలు మంజూరు చేయాలని తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని డిమాండ్ చేసారు. “మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని” కార్యక్రమంలో భాగంగా 33వ రోజు హరిపురం కాలనీలో ఆయన పర్యటించారు. స్థానిక నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టి స్వాగతం పలుకగా, యువత బాణాసంచా కాల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం ఇంటి ఇంటికి తిరుగుతూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను గురించి వివరించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
పేరూరు పంచాయితీ, హరిపురం కాలనీలో ఏళ్ల తరబడి నివాసం ఉంటూ… పక్కా గృహాలు నిర్మించుకున్న నిర్వాసితులకు పట్టాలు ఇవ్వాలని కోరారు. అలాగే క్రయవిక్రయాలు జరుపుకునే అవకాశాన్ని కల్పించాలని వైసిపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ అవకాశాన్ని కల్పిస్తే పిల్లలు పెళ్లిళ్లు, చదువులు కోసం ఒకరిపై ఆధారపడకుండా గౌరవంగా జీవిస్తారని అన్నారు.
పేరూరుకు చెందిన లలిత తన బంధువులతో కలసి తనపల్లిలో ఒక్కో ఫ్లాట్ కు రూ.7లక్షలు వెచ్చించి 10 డికేటీ ప్లాట్లు కొన్నట్లు కొనుగోలు చేసింది. అయితే వైసీపీ నాయకులు డికేటీ పట్టాలు బలవంతంగా లాక్కున్నారని పులివర్తి నాని దృష్టికి తీసుకువచ్చింది. స్పందించిన పులివర్తి నాని మొదట పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లించిన డబ్బులు వసూళ్లు చేయిస్తానని భరోసా కల్పించారు.
అవినీతి, అసమర్థ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపుదాం…
అవినీతి, అసమర్థమైన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని పులివర్తి నాని పిలుపునిచ్చారు. రూ.10 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా వైసీపీ ప్రభుత్వం దిగజార్చిందని ఆరోపించారు. ఆ డబ్బంతా ఏమవుతోందని ప్రశ్నించారు. బటన్ నొక్కుడే తప్ప లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు పడడం లేదన్నారు. ఒకవైపు అప్పులు చేసిన డబ్బు.. మరోవైపు ఇసుక మాఫియా, జే బ్రాండ్ లిక్కర్ అమ్మకాల నుంచి భారీగా దోచుకుంటున్నారని ఆరోపించారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే సెంటు భూమి కూడా ప్రభుత్వ అధీనంలో లేకుండా కబ్జా చేసేస్తారని, ఆ పార్టీని ఇంటికి పంపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అభివృద్ధిలో ఇప్పటికే 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయామని చంద్రబాబు నాయుడు లాంటి విజన్ ఉన్న నాయకుడు ద్వారానే అభివృద్ధి జరుగుతుందని మరోసారి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పేరూరు అధ్యక్షుడు శ్రీనివాసులు,మాజీ ఎంపీటీసీ గోపి, కాయం వెంకటేష్, ముని హేమంత్ రెడ్డి,రంగనాథ్, దమనేటి నాగరాజ్, మహేష్ రాయల్, లక్ష్మి ప్రసన్న కుమార్, అనిల్ రాయల్, వెంకటేష్, నటరాజ్, కిరణ్ కుమార్, జ్ఞానేశ్వర్ రెడ్డి, జగదీష్ రెడ్డి,వేణుగోపాల్ నాయుడు, మురళి, హర్ష,ముంతాజ్ బేగం, లక్ష్మి,మున్న, కోకిల,సహిన భాను,తదితరులు పాల్గొన్నారు.