హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై యాదవ సంఘాలు భగ్గుమన్నాయి. నిరసనగా గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చాయి..
ఇందులో భాగంగా గురువారం ఇందిరాపార్కు దగ్గర ఆందోళన చేపట్టాయి. అనంతరం యాదవ జేఏసీ ర్యాలీగా గాంధీభవన్‌కు బయల్దేరారు. ఈ క్రమంలో గొల్లకురుమలను ఇందిరాపార్కు దగ్గరే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో యాదవ సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని యాదవ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే యాదవ సంఘాల గాంధీభవన్ Gandhi bhavan) ముట్టడితో పోలీసులు అప్రమత్తమయ్యారు. గాంధీభవన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. బారిగేడ్లు ఏర్పాటు చేసి ఎవరినీ అటు వైపుగా రాకుండా కట్టడి చేస్తున్నారు..