- రెడ్డి కార్పొరేషన్ ను వెంటనే అమలు చేయాలి
- రెడ్డి సంఘం అధ్యక్షులు గాదే రఘునాథ్ రెడ్డి
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని రెకొండ,చిగురుమామిడి, లంబాడిపల్లి,సీతారాంపూర్, సుందరగిరి,కొండాపూర్, గాగిరెడ్డీపల్లి, ఇందుర్తి తదితర గ్రామాలలో శుక్రవారం జిల్లా రెడ్డి సంఘం నాయకులు జూన్ 6 న కరీంనగర్లో జరగబోయే రెడ్ల ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది, అనంతరం ఇందుర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ 2018 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రెడ్డి కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలనీ ప్రధాన డిమాండ్ తో పాటు నిరుపేద రెడ్డి ల అనేక సమస్యలతో పాటు పలు డిమాండ్లతో జూన్ 6 అనేక డిమాండ్లతో కూడిన రెడ్డిల ఆత్మీయ సమ్మేళనం కరీంనగర్ శివారులో చింతకుంట లోని ఎస్.వి.ఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి చిగురుమామిడి మండలంలో ఉన్న అన్ని గ్రామాల రెడ్డి సంఘం సభ్యులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునివ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఆర్.బి.వి.ఆర్ ప్రధాన కార్యదర్శి బండ గోపాల్ రెడ్డి రెడ్డి, ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు వంచ సుదర్శన్ రెడ్డి, ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీందర్ రెడ్డి, చిగురుమామిడి మండల ఐక్యవేదిక ఇంచార్జ్ కాటం సంపత్ రెడ్డి, మండలంలోని వివిధ గ్రామాల అధ్యక్షులు పరిపాటి జయపల్ రెడ్డి, గడ్డం సురేందర్ రెడ్డి, కటం సంపత్ రెడ్డి, వడియల రవీందర్ రెడ్డి, అన్నడి ఎల్లారెడ్డి, గాదె రఘునాథ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు జంగ వెంకట రమణ రెడ్డి, సర్పంచులు గోలి బాపురెడ్డి, నాగెళ్లి వకుళ లక్ష్మ రెడ్డి,ఉప సర్పచ్ సత్యనారాయణ రెడ్డి,పన్యాల వాసుదేవ రెడ్డి, మల్లారెడ్డి, సంపత్ రెడ్డి, సంజీవరెడ్డి, బజార్ రాజిరెడ్డి, చెంద్ర రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి,రెడ్డి సంఘం ఉపాధ్యక్షులు కార్యదర్శులు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.