- నిండు గర్భిణిని ఆటోలో తరలిస్తున్న కుటింబికులు
అల్లూరి జిల్లా, హుకుంపేట మండలం గర్భిణి స్త్రీ తీవ్ర రక్తస్రావంతో అస్వస్థతకు గురి కావడంతో సొంత ఆటోలోనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించిన ఘటన హుకుంపేట మండల తీగలవలస పంచాయతీ వై గరుడపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారంగా పాంగి రాంబాబు భార్య రాములమ్మ మూడు నెలల గర్భవతి ఆమెకు అకస్మికంగా తీవ్ర రక్తస్రావము ఏర్పడుతూ అస్వస్థతకు గురికావడంతో కుటుంబీకులు గ్రామస్తులు ప్రభుత్వ అంబులెన్స్ 108 సిబ్బంది ఫోన్ చేసి సమాచారం అందించారు.
అయితే ఆంబులెన్స్ వారి గ్రామానికి రాకపోవడంతో అధిక రక్తస్రావం అవడంతో సొంత ఆటోలో సొంత ఖర్చులతో ఆశ వర్కర్లు అంగన్వాడి టీచర్లు కుటుంబ సభ్యులు కలిసి ఆడేరు జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు.
..రహదారి సౌకర్యం ఉండి కూడా అంబులెన్స్ రాకపోవడం విశారకరమని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వి. లక్ష్మణరావు అన్నారు అన్ని సౌకర్యాలు ఉండి కూడా అంబులెన్స్ సకాలంలో రాకపోవడం ప్రభుత్వ వైపరీత్యాన్ని ఆయన అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో వైద్య సేవలు కొరవడిందని ఆయన విమర్శించారు. దాని కారణంగానే అనేక మరణాలు సంభవిస్తుందని దీనికి ప్రభుత్వ బాధ్యత వహించాలని ఆయన చేశారు.