సిద్దిపేట జిల్లా : బెజ్జంకి మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా బేగంపేట గ్రామానికి చెందిన అన్నాజీ వెంకటేష్, ప్రధాన కార్యదర్శిగా మచ్చ కుమార్ ను శనివారం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ చేతుల మీదుగా నియామక పత్రాన్ని కాంగ్రెస్ పార్టీ మండల యువజన అధ్యక్షులు మాంకాల ప్రవీణ్ అందజేశారు. తన నియామకానికి సహకరించిన మానకొండూర్ పార్టీ ఇంచార్జ్ కవంపల్లి సత్యనారాయణ కు, కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్ కు, శివసేనారెడ్డి, పడాల రాహుల్ కు అన్నాజీ వెంకటేష్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ ఒగ్గు దామోదర్, పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ ధోని వెంకటేశ్వరరావు, మానాల రవి, బండి పెళ్లి రాజు, శన గొండ శ్రావణ్, గుడెల్లి శ్రీకాంత్, గుండ అమరేందర్ రెడ్డితదితరులు పాల్గొన్నారు.