సాధారణంగా తిప్పతీగను ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఆయుర్వేద గుణాలు ఉండే తిప్పతీగలో ఎన్నో అద్భుతమైన గుణాలు
తాజాగా కొంతమంది నిపుణులు తిప్పతీగ ఉపయోగించడం వల్ల లివర్ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఈ తిప్పతీగని ఉపయోగించడం వల్ల లివర్ సమస్యలు వస్తాయని ఆరుగురు పేషెంట్లలో దీనిని గుర్తించినట్లుగా నిపుణులు చెబుతున్నారు
ఏదేమైనా సరే తిప్పతీగ వల్ల ఇటువంటి సమస్యలు రావని ఇటువంటి ఫేక్ వార్తలను నమ్మొద్దని మరికొంతమంది చెబుతున్నారు. ఎన్నో ఏళ్ళ నుండి ఆయుర్వేదం వైద్యంలో తిప్పతీగను ఉపయోగిస్తున్నారు.
దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. అయితే నిపుణులు తిప్పతీగ గురించి పూర్తిగా స్టడీ చేశారు. అదే విధంగా ఇది ఎలాంటి సమస్యలకి గురి చేస్తుంది అనే దాన్ని కూడా పూర్తిగా స్టడీ చేయడం జరిగింది. అయితే దీని వల్ల ఎటువంటి సమస్యలు రావని వెల్లడించింది.
అలానే ఇది మాత్రమే కాకుండా కొన్ని స్టడీస్ కూడా తిప్పతీగ వల్ల మంచి ఫలితం రాదని తెలియజేశారు. అయితే దీని వల్ల ఎటువంటి సమస్యలు రావు. కానీ తిప్పతీగ లాంటి మూలిక మరొకటి వుంది. అదే TinosporoCrispa. దీని వల్ల నెగిటివ్ ప్రభావం కలిగే అవకాశం ఉందని అంటున్నారు.
కానీ తిప్పతీగ వల్ల రాదు అని తెలియజేశారు. అందుకని ఎప్పుడైనా స్టడీస్ చేసేటప్పుడు సరిగా ముందు తిప్పతీగని తీసుకుని స్టడీ చేయాలని కూడా చెబుతున్నారు నిపుణులు. అలానే ఇప్పుడు కానీ గతంలో కానీ దీని వల్ల ఏ సమస్య వచ్చినట్లు గుర్తించలేదని తెలియజేశారు.
ఆయుర్వేద మందుల్లో తిప్పతీగని ఎక్కువగా వాడుతూ ఉంటారు. నిజంగా ఎన్నో రకాల సమస్యలు తగ్గుతాయి. తిప్పతీగలో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. స్టెరాయిడ్స్ మరియు కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి.
తిప్పతీగ వల్ల ఎలాంటి ప్రయోజనం పొందవచ్చు అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే తిప్పతీగ వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను మనం తరిమికొట్టొచ్చు. దీని వల్ల చాలా లాభాలు ఉన్నాయి. మరి ఇక వాటి కోసం చూస్తే… ఒకటి కాదు రెండు కాదు తిప్పతీగ వల్ల చాలా ప్రయోజనాలు మనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఎన్నో ఏళ్ల నుంచి ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే తిప్పతీగ రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. తిప్పతీగ లో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో కూడా ఫైట్ చేయగలవు.
శరీరంలోని కణాలు దెబ్బ తినకుండా ఉండడానికి ఎంతో బాగా తిప్పతీగ సహాయం చేస్తుంది. అలానే ఎన్నో అనారోగ్య సమస్యలు తరిమికొట్టడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. సీజనల్ వ్యాధులు, విష జ్వరాలు అయిన డెంగ్యూ, మలేరియా వంటి సమస్యలు కూడా ఇది తగ్గిస్తుంది.
అలానే తిప్పతీగ వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. చాలా మంది మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటుంటారు. అటువంటి వాళ్ళు తిప్పతీగ తీసుకుంటే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అదే విధంగా ఆందోళన కూడా తగ్గుతుంది. జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి కూడా తిప్పతీగ బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా కూడా తిప్పతీగ ఉపయోగించి సమస్యలను పరిష్కరించుకోవచ్చు.
అంతే కాదండి జీర్ణ వ్యవస్థను మెరుగు పరచడంలో కూడా తిప్పతీగ ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అజీర్తి సమస్యతో బాధ పడేవారు తిప్పతీగ తో తయారు చేసిన మందులు ఉపయోగిస్తే మంచిది. మధుమేహానికి కూడా ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా చెప్పాలంటే టైప్ 2 డయాబెటిస్ ని ఇది త్వరగా పోగొడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలని కూడా తగ్గిస్తుంది. తిప్పతీగలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. శ్వాసకోస వ్యాధులతో బాధపడేవారికి మంచిగా ఉపశమనం లభిస్తుంది.
ఇది ఇలా ఉండగా ఆర్థరైటిస్‌తో బాధపడే వాళ్లకి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. కీళ్ళ వ్యాధులను కూడా ఇది తగ్గిస్తుంది. కంటి చూపును మెరుగు పరచడానికి కూడా ఇది ఎంతో బాగా ఉపయోగ పడుతుంది.
వృద్ధాప్య ఛాయలు రాకుండా కూడా ఇది చూసుకుంటుంది. ఇలా చాలా ప్రయోజనాలు మనం తిప్పతీగతో పొందొచ్చు. రక్తాన్ని ప్యూరిఫై చేయడానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ని తొలగిస్తుంది మరియు లివర్ సమస్యలని కూడా తొలగిస్తుంది.
రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ని కూడా తొలగించడానికి ఇది ఎంతో సహాయపడుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండే తిప్పతీగ లో జ్ఞాపక శక్తిని మెరుగు పరిచే గుణాలు, ఒత్తిడిని తగ్గించే గుణాలు ఉంటాయి.
బౌల్ రిలేటెడ్ సమస్యలని కూడా ఇది తొలగిస్తుంది. డార్క్ స్పాట్స్, పింపుల్స్ వంటి వాటిని కూడా ఇది పోగొడుతుంది. ఇలా ఇన్ని మంచి గుణాలు ఉండే తిప్పతీగ లో తిప్పతీగ తో ఎన్నో అనారోగ్య సమస్యలను మనం తగ్గించుకోవచ్చు.
మహమ్మారి సమయంలో తిప్పతీగ:
మహమ్మారి కారణంగా మనం సమస్యలతో సతమతం అవుతూనే వున్నాం. ఈ మహమ్మారి సమయంలో 70 శాతం మంది భారతీయులు తిప్పతీగను ఉపయోగించారు అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఎన్నో రకాల సమస్యలని ఇది వాళ్ళల్లో తగ్గించిందని గుర్తించారు.
లివర్‌ని తిప్పతీగ డ్యామేజ్ చేస్తుందా..?
ఇక మన లివర్‌ని తిప్పతీగ డ్యామేజ్ చేస్తుందా లేదా అనే విషయాన్ని చూస్తే.. కొంతమంది వైద్యులు చెప్పిన దాని ప్రకారం తిప్పతీగని ఉపయోగించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని.. సీరియస్‌గా ఏ సమస్యలు రావని చెబుతున్నారు.
ఎక్కువగా తిప్పతీగను ఉపయోగించడం వల్ల కాన్స్టిపేషన్ లేదా షుగర్ లెవల్స్ తగ్గిపోవడం లాంటివి మాత్రమే జరుగుతాయని అన్నారు. ఒకవేళ కనుక మీరు పిల్లలకు పాలిచ్చే తల్లులు అయినా లేదా గర్భిణీలు అయినా సరే తీసుకోవడం మంచిది కాదని చెప్పారు. ఇదిలా ఉంటే ఏదైనా ఎక్కువ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని అని ఆ లిమిట్ దాటకూడదు అని అంటున్నారు డాక్టర్లు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.