జోగులంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ధరూర్ మండలంలో సోమవారం ఉప్పెరు ,గార్లపాడు, ఖమ్మం పాడు ,వామన్ పల్లి ,చింత రేవుల గ్రామాల్లోనాలుగవ రోజు బిజెపి జెండా ఆవిష్కరించిన బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె. అరుణమ్మ.ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి డికె. అరుణమ్మ మాట్లాడుతూ అభివృద్ది కోసం కేంద్రం ఇస్తున్న నిధులను కేసీఆర్ దోచుకుంటున్నాడని ఆరోపించారు.సొమ్ము కేంద్రానిది సోకు రాష్ట్రానిది అన్నట్లుగా పరిస్థితి తయారైందని అన్నారు.కేంద్ర నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే , బిఆర్‌ఎస్ నాయకులు అవన్నీ వారి ఖాతాల్లో వేసుకుంటున్నారు.గర్భిణీల కోసం రూ.6 వేలు అందిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 6 వేలు జోడించి మొత్తంగా రూ.12 వేలు తామే పంపిణీ చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటుందని అన్నారు. 10కోట్ల మంది పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు శ్రీకారం చుట్టి మూడొంతులకు పైగా పంపిణీ చేసినట్లు వెల్లడించారు. రైతే రాజంటూ పదే పదే చెప్పుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ వారి అభివృద్ధి కోసం మద్ధతు ధర కూడా అమల్లోకి తేలేదని మండిపడ్డారు. గ్రామాల్లో బిఆర్ఎస్ నాయకులకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం క్రిష్ణ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు, మండల అధ్యక్షుడు రాజేష్ అయ్యా,బిజెపి సీనియర్ నాయకులు బండల వెంకట రాములు, మిర్జాపురం రామచంద్ర రెడ్డి,మిర్జాపురం వెంకటేశ్వర రెడ్డి,ఉప్పెరు అంజి రెడ్డి,సరళమ్మ,గార్ల పాడు రాఘవేంద్ర రెడ్డి ,హన్మంత్ రాయ ,నర్సన్ దొడ్డి క్రిష్ణ రెడ్డి, తదితరులు ఉన్నారు.
