పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలో జనసైనికులపై పోలీసుల అత్యుత్సాహ బల ప్రదర్శన చేసారు. వైసిపి నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలంటూ శాంతియుతంగా నిరసన ర్యాలీ చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను కించపరిచే విధంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన వైసిపి నాయకుల పైశాచిక ఆనందం పొందుతున్నారని,పేదలకు పెత్తందారులకు మద్య జరిగే యుద్ధం అంటూ బ్యానర్లతో ప్రచారం చేసినంత మాత్రాన ప్రజలు నమ్మే స్థితిలో లేరని సాంఘీక మాద్యమాల నుండి నడిరోడ్డుపై ఫ్లెక్సీలు వేయించేంత పెత్తందారీ తనం ఎవరిదో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు..
రెండు రోజుల క్రితం వెలిసిన ఫ్లెక్సీలను తొలగించాలని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోగా మరో రెండు ఫ్లెక్సీలను అదనంగా కట్టారని జనసైనికులను రెచ్చగొట్టే ధోరణితో ప్రవర్తించటం వైసిపి నాయకుల పెత్తందారి తనానికి నిదర్శనమని నిప్పులు చెరిగారు..
అభ్యంతరకరమైన ఫ్లెక్సీల తొలగింపు చర్యలు త్వరగతిన సాగకుంటే స్థానిక ఎమ్మెల్యే కాసు ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించిన జనసైనికులు,సామాన్య ప్రజలకు రాక్షస పాలనకు పోరాటమంటూ తమ బ్యానర్ తో నినాదాలు చేసారు .
వివాదాలకు దారి తీసే ఫ్లెక్సీలపై పట్టణ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేసిన జనసేన నాయకులు..బ్యానర్ల తొలగింపుపై అధికారులు అలసత్వం చూపితే జనసేన ఫ్లెక్సీలు కూడా పట్టణంలో వెలుస్తాయన్నారు.