అనంతపురం జిల్లా గుత్తి మండలం వన్నే దొడ్డి రైతు భరోసా కేంద్రం లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతులకు సబ్సిడీ క్రింద వేరుశెనగ పంపిణీను గుంతకల్ నియోజకవర్గం శాసన సభ్యులు Y వెంకటరామరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుత్తి మండలం లో 15 రైతు భరోసా కేంద్రాల నందు వేరుసెనగ కాయలు రైతులకు అందుబాటులో లో ఉన్నాయి. రిజిస్ట్రషన్ చేసుకొన్న రైతులందరూ విత్తనాలు తీసుకోవలసిందిగా MLA తెలిపారు. మరియు విత్తన నాణ్యత పరిశీలించి వేరుశెనగ విత్తనం క్వాలిటీ బాగుందని ఇలాంటి నాణ్యమైన విత్తనం సరఫరా చేయాలని కోరారు .
ఈ కార్యక్రమంలో గుత్తి మండల ఇంఛార్జి శ్రీనవాస రెడ్డి , ఎంపీపీ విశాలాక్షి , జడ్పిటిసి ప్రవీణ్ కుమార్ యాదవ్ , మండల వ్యవసాయ అధికారి ముస్తాక్ అహ్మద్ ,మండల కన్వనర్ గోవర్ధన్ రెడ్డి, వన్నేదొడ్డి సర్పంచ్ వేంకట రాముడు, ప్రజా ప్రతినిధులు శుభస్ రెడ్డి , రైతులు తదితరులు పాల్గొన్నారు.