- అగ్ని ప్రమాదం బాధితులకి మాచర్ల టిడిపి ఇన్చార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి 50 వేలు ఆర్థిక సాయం
- మన తోటి వారికి కష్టం వచ్చినప్పుడు మనకి తగిన సహాయం చేయడం కనీస మానవధర్మం
- ఇది చిరు సహాయం మాత్రమే నని రానున్న రోజుల్లో మరింత సహాయం అందిస్తాం అని అగ్ని ప్రమాదం బాధితులకి టిడిపి ఇన్చార్జి బ్రహ్మానందరెడ్డి హామీ
పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలోని వడ్డెర కాలనీలో గల గత రెండు రోజుల క్రితం షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంభవించి ఇల్లు. ఇంట్లోనే వివిధ విలువైన వస్తువులు నగదు పూర్తిగా కాలిపోయి నడిరోడ్డుపై నిలబడ్డ కుటుంబానికి తమ వంతు సహాయంగా టిడిపి మాచర్ల ఇంచార్జి బ్రహ్మానందరెడ్డి 50 వేలు నగదు సహాయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తోటి వారికి కష్టం వచ్చినప్పుడు కులమత బేధాలు ఏమి ఆలోచించకుండా మనకి తగినంత సహాయం చేయడం కనీస మానవ ధర్మమని . ఇది చిరు సహాయం మాత్రమేనని అన్ని సర్వస్వం కోల్పోయిన మీకు ఇది చిన్నదేనని రానున్న రోజుల్లో మరింత సహాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ మరియు మండల పరిధిలోని టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు