సిద్దిపేట జిల్లా: బెజ్జంకి మండలం బేగంపేట గ్రామానికి చెందిన బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బుర్ర నిశాంత్ గౌడ్ రెండు రోజుల క్రితం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం తాడిచెర్లపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా మంగళవారం బిజెపి రాష్ట్ర నాయకులు దరువు ఎల్లన్న కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు ధోనె అశోక్, సీనియర్ నాయకులు పెద్దోళ్ల శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి దొంతర వేణి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు సంఘ రవి, చేపూరి కృష్ణమూర్తి, అమర్నాథ్, గొడుగు సంపత్, జాగితి వెంకట్, మచ్చ మురళీకృష్ణ తదితరులు ఉన్నారు.