- ప్రత్యేక పూజలు నిర్వహించిన ఇందుర్తి ఎంపీటీసీ టు కోమటిరెడ్డి చంద్రకళ రాంగోపాల్ రెడ్డి…
- లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సీనియర్ జర్నలిస్ట్ గాదే రఘునాథరెడ్డి ప్రత్యేక పూజలు
కరీంనగర్ జిల్లా:చిగురుమామిడి మండలం ఓగులాపూర్ గ్రామంలో మంగళవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ జాతరను వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రేణుక ఎల్లమ్మ తల్లికి పెద్ద ఎత్తున బోనాల సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బైండ్ల పూజారులు ఆలయం ముందు పెద్ద పట్నాలు వేసి ఎల్లమ్మ కథను భక్తులకు వివరించారు.ఈ సందర్భంగా శ్రీ రేణుక ఎల్లమ్మను ఇందుర్తి ఎంపీటీసీ టు కోమటిరెడ్డి చంద్రకళ రాంగోపాల్ రెడ్డి ,లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సీనియర్ జర్నలిస్ట్ గాదే రఘునాథరెడ్డిలు ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారిని గత వారం రోజుల నుండి పోచమ్మ బోనాలతో పాటు అమ్మవారి నీ దర్శించుకునేందుకు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈసారి అన్ని వసతులు కల్పించి అంగరంగ వైభవంగా జాతరను నిర్వహించారు ఇందుర్తి ఎంపీటీసీ టు కోమటిరెడ్డి చంద్రకళ రాంగోపాల్ రెడ్డి దంపతులను లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, గాదే రఘునాథ్ రెడ్డి కి గౌడ సంఘం నాయకులు శాలువాకప్పి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బోయిని శ్రీనివాస్,గౌడ సంఘం అధ్యక్షుడు గట్టు మధు గౌడ్ ,ఉపసర్పంచ్ కోమటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,మాజీ సర్పంచ్ కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి,మాజీ ఉపసర్పంచ్ గట్టు శ్రీలత,గౌడ సంఘ నాయకులు ఉల్లి శ్రీనివాస్, ఉల్లి విగ్నేష్,గట్టు మునిందర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ ఏలేటి వెంకటరెడ్డి,ముసుకు మహేందర్ రెడ్డి,ప్రభాకర్ రెడ్డి, గౌడ సంఘ నాయకులు మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.