కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం లోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట. బోనాల జాతర కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్న సెంట్రల్ ఫిలిం సెన్సర్ బోర్డ్ సభ్యులు డా. దరువు ఎల్లన్న మరియు బిజెపి నాయకులు కేతిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి .దర్శనం అనంతరం దరువు ఎల్లన్న మాట్లాడుతూ అమ్మవారి కరుణాకటాక్షలతో రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.వారి వెంట ఆలయ కమిటీ చైర్మన్ గుర్రం వాసు, వైస్ చైర్మన్ పైడిపెల్లి శ్రీనివాస్, కమిటీ సభ్యులు బొమ్మ సదాశివ్, బొమ్మ రామనందం, బుర్ర శ్రీనివాస్, పులి వెంకటేష్, బొమ్మ మహేష్, బూత్ అధ్యక్షులు దొమ్మడి రాజేందర్, నూకల శ్రావణ్, కుర్ర హరీష్, మచ్చ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.