మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలోని బొల్లెపెల్లి గ్రామంలో గురువారం నడిరోడ్డుపై స్కూటీ తగలబడింది. స్కూటీపై వెళ్తుండగా అకస్మాత్తుగా ముందుబాగంలో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన వాహనదారుడు స్కూటీని ఆపి దిగిపోయాడు. ఈ ఘటనలో స్కూటీ ముందుభాగంగా పూర్తిగా కాలిపోయింది.
గూడూరు మండలం బోల్లేపల్లి గ్రామంలో గురువారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు స్కూటీలో మంటలు చెలరేగాయి. గుండెంగాకు చెందిన బోడ రవీందర్ స్కూటీపై వెళ్తుండగా…ముందు భాగంలో మంటలను స్థానికులు గుర్తించి రవీందర్‌కు చెప్పారు. దీంతో రవీందర్ బండిని ఆపి దిగిపోయాడు. ఆ తర్వాత స్థానికుల సహాయంతో మంటలను ఆర్పేశారు