హైదరాబాద్: నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం కొనసాగించామని.. మనసా, వాచా, కర్మణా సకల జనులు పోరాడితేనే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడారు.
‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు. తెలంగాణ కోసం అమరులైన వారిని స్మరించుకుందాం. ప్రత్యేక రాష్ట్ర సాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నమస్సులు. ఒకరిద్దరి వల్లే తెలంగాణ రాలేదు. ప్రత్యేక రాష్ట్రం వచ్చేందుకు కృషి చేసిన దివంగత కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌కు ఈ సందర్భంగా నివాళులర్పిద్దాం. చిన్న రాష్ట్రాల వల్లే ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయనేది భాజపా ఉద్దేశం.
రాష్ట్రంలో కుటుంబపాలనతో ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తోంది. నేడు తెలంగాణ.. ఓ కుటుంబానికి బానిసగా మారే పరిస్థితి వచ్చింది. దొరికిన అన్ని చోట్లా అప్పులు తెస్తున్నారు. తెలంగాణ తెచ్చుకున్నది అప్పుల కోసమా? నిధులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఫామ్‌హౌస్‌లు పెరుగుతున్నాయే తప్ప