పల్నాడు జిల్లా : పిడుగురాళ్ళ పోలీస్ స్టేషన్ పరిది లో ది.10.04.2023 న 02 బైకులను దొంగతనం చేసిన మరియు రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్రంలో మరెన్నో దొంగతనాలు చేసిన అంతరాష్ట్ర దొంగల ముఠాను Cr. No. 180/2023. u/s: 379 IPC of Piduguralla PS కేసు లో ఈ రోజు అనగా 05.06.2023 న అరెస్ట్ చేసిన పిడుగురాళ్ళ పోలీసులు .
ముద్దాయిలు పేర్లు :-
1. వడ్లమాను శివారెడ్డి, S/o వేమారెడ్డి, 35 సం.లు, కులము: రెడ్డి, అంకిరెడ్డిపాలెం గ్రామము, గుంటూరు రూరల్ మండలము, గుంటూరు జిల్లా
2. పులి అంజిరెడ్డి S/o వెంకటశ్వరరెడ్డి, 38 సం.లు, కులము: రెడ్డి, దొండపాడు గ్రామము, నరసరావుపేట మండలము, పల్నాడు జిల్లా
3. దేవరకొండ శ్రీను S/o సుబ్బారావు, 32 సం.లు, కులము: ఎరుకుల, పూనూరు గ్రామము, యద్దనపూడి మండలము, ప్రకాశం జిల్లా
4. కుంభా పెద్ద రోశయ్య @ రోశయ్య S/o గోవిందు, 32 సం.లు, కులము: ఎరుకుల, కామేపల్లి గ్రామము, సంతమంగుళూరు మండలము, బాపట్ల జిల్లా”
స్వాధీనపరుచుకున్న సొత్తు:-
ఒక రెనాల్ట్ క్విడ్ కారు, నాలుగు బైక్ లు, వాటి విలువ సుమారు రూ.7,00,000/- లు.*
నేరం చేసిన విధానం:-
పైన తెలిపిన ముద్దాయిలు చెడు వ్యసనాలకు బానిసలై విడివిడిగా దొంగతనాలకు చేసేవారు. ఆ క్రమంలో వీరిని పల్నాడు జిల్లా పోలీస్ వారు అరెస్ట్ చేసి నరసరావుపేట సబ్-జైలు కి పంపించగా అక్కడ వీరందరూ ఒకోరికొకరు పరిచయమై జైలు నుండి బయటకు వచ్చిన తరువాత అందరూ కలిసి దొంగతనాలు చెయ్యడం ప్రారంభించారు.
పై నలుగురు కలిసి
1) ఒంగోలులో కర్నూల్ రోడ్డు ఎదురుగా ఒక ప్రభుత్వ మద్యం షాపులో రూ. 3,76,500/- లను
2) ఒంగోలు కిమ్స్ ఆసుపత్రి సమీపం లో మహేంద్రా షో రూమ్ లో టూల్ కిట్ -1, లాప్ టాప్ -1, లెనోవో ట్యాబు-1, సెల్ ఫోన్లు -4, బ్యాంకు కార్డు-1 లను
3) గుంటూరులోనే నగరంపాలెం ఏరియాలో గల శ్రీనివాసరావుపేట మెయిన్ రోడ్డు నందుగల రిలయన్స్ స్టోర్ లో రూ. 4,56,400/- లను
4) తాడేపల్లి టౌన్ ఏరియా లో ఉషోదయ సూపర్ మార్కెట్ షాప్ లో Rs. 11,76,500/- లను
5) ఒంగోలు జిల్లా సింగరాయకొండలో గల కందుకూరు రోడ్ ఏరియా లో ఉన్న సూపర్ మార్కెట్ షాప్ లో రూ.15000/- లు
6) ఒంగోలు శివారులో ఉన్న ఓల్డ్ బైపాస్ రోడ్ నందు ఉన్న ఒక కార్లు అమ్మే కంపెనీలో ఒక రెనాల్ట్ క్విడ్ కారు, ఒక HP కంపెనీ లాప్టాప్
7) ప్రకాశం జిల్లా టంగుటూరు గ్రామంలోనే జగనన్న కాలనీ లో ఒక ఇంట్లో రూ.30000/- డబ్బులు మరియు చిన్న బంగారు, వెండి వస్తువులను
8) ప్రకాశం జిల్లా, టంగుటూరు గ్రామంలోని అనంతవరం రోడ్ లో గల భాష్యం స్కూల్ దగ్గర శ్రీ శ్రీనివాస ఆక్వా ఫీడ్స్ షాప్ నందు రూ.220000/- లను
9) ఒంగోలు చెరువు రోడ్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో హుండీ పగలగొట్టి అందులో ఉన్న రూ.10000/- లను
10) పిడుగురాళ్ళ టౌన్ లోని SBI మై బ్రాంచ్ ముందు పార్క్ చేసిన రెండు బైక్ లను
11) వేల్పూరు గ్రామంలో ఒక బైక్ ను
12) కర్లపాలెం మండలం, యాజలి గ్రామంలో ఒక బైక్ ను దొంగిలించినారు మరియు
13) తెలంగాణ రాష్ట్రం,ఖమ్మం జిల్లా, మధిర టౌన్ ఏరియా లో రాయపట్నం రోడ్డు నందుగల సాయి దుర్గా వైన్ షాప్ లో అటెంప్ట్ చేయగా పోలీస్ వారు వచ్చేసరికి పారిపోయారు.
పై వారు మరలా మరో దొంగతనానికి వారు ఇంతకు ముందు దొంగిలించిన ద్విచక్ర వాహనాలపై జూలకల్లు వైపు వస్తుండగా జూలకల్లు అడ్డు రోడ్ వద్ద CI గారు మరియు SI పఠాన్ రబ్బాని గారు మరియు వారి సిబ్బందితో వెహికల్ చెకింగ్ చేస్తూ పైవారిని పట్టుకుని పిడుగురాళ్ళ పోలీసు స్టేషన్ క్రైమ్ నెం. 180/2023 U/s 379 IPC కేసులో అరెస్ట్ చేసినారు.
ఈ సందర్భంగా పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ వై. రవి శంకర్ రెడ్డి మాట్లాడుతూ ..
వడ్లమాను శివారెడ్డి అను ముద్దాయి పై గతంలో 58 కేసులు నమోదు అయి ఉన్నాయని జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత మరొక 13 నేరములు చేశాడని, అలాగే పులి అంజిరెడ్డి పై ఏడు కేసులు ఉండగా మరొక 8 నేరములు చేసినట్లుగాను, దేవరకొండ శ్రీను పై 9 కేసులు నమోదయి ఉన్నాయని అతను మరొక ఐదు నేరములు చేసినట్లుగాను, కుంభా పెద్ద రోశయ్య అను ముద్దాయి ఐదు కేసులు నమోదు అయి ఉన్నాయని ఇతను మరొక తొమ్మిది నేరములు చేశాడని జైలు నుండి బయటకు వచ్చిన తరువాత వీరిపై నిఘా ఉంచడం జరిగిందని పిడుగురాళ్ల పట్టణంలో బైకుల దొంగతనం జరగ్గా దీనిపై గురజాల డిఎస్పి పల్లపు రాజు గారికి ఆదేశాలు ఇవ్వగా ఆయన పిడుగురాళ్ల సీఐ p v ఆంజనేయులు మరియు వారి సిబ్బంది ద్వారా సదరు ముద్దాయిలను చాకచక్యంగా పట్టు కొని వారిని అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 7 లక్షల రూపాయలు విలువ కలిగిన ఒక కారు నాలుగు బైకులను సదరు ముద్దాయిల వద్ద స్వాధీనపరచుకోవడం జరిగిందని ముద్దాయిలను అరెస్టు చేసి దొంగిలించబడిన బైక్ లను మరియు కారును రికవరీ చేసినందుకు డిఎస్పి పల్లపు రాజు గారిని, పిడుగురాళ్ల సీఐ పీవీ ఆంజనేయులు,SI పఠాన్ రబ్బానీ ఖాన్, ASI 2845, G. శ్రీనివాసరావు, HC 3856 ,M. బాలకృష్ణ,
PC 961 D. వెంకటేశ్వరరావు, PC 4118 M.వెంకటేష్ లను ఈ సందర్భంగా అభినందించారు.