కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలో ఈనెల 10వ తేదీన జరిగే ప్రగతి నివేదన సభ బిఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు గూడూరి సురేష్ ఆధ్వర్యంలో ప్రచురించిన వాల్ పోస్టర్ను క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మడుగుల రవీందర్ రెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పి వైస్ చైర్మన్ సిద్ధం వేణు, జితేందర్ రెడ్డి, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంప వెంకన్న, బద్దం తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.