తిరుపతి: శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పాపులేషన్ స్టడీస్ అండ్ సోషల్ వర్క్ విభాగపు పరిశోధక విద్యార్థి బొంద మురళీకృష్ణ కు డాక్టరేట్ ప్రధానం చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఎం. దామ్లా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పాపులేషన్ స్టడీస్ అండ్ సోషల్ వర్క్ విభాగంలో ప్రొఫెసర్ పి. వినాయగ మూర్తి గారి పర్యవేక్షణలో బొంద మురళీకృష్ణ “యూత్ అండ్ సోషల్ దెటర్మినంట్స్ ఆఫ్ హెల్త్ – ఏ స్టడీ అమాంగ్ ఎస్సీస్ ఇన్ చిత్తూర్ డిస్టిక్, ఆంధ్రప్రదేశ్” అనే అంశంపై సిద్ధాంత గ్రంధాన్ని విశ్వవిద్యాలయానికి సమర్పించినట్లు వెల్లడించారు. బొంద మురళీకృష్ణ పలు జాతీయ అంతర్జాతీయ పరిశోధన జర్నల్స్ లలో అనేక పరిశోధనా వ్యాసాలను ప్రచురించినట్లు వివరించారు. బొంద మురళీకృష్ణ కు డాక్టరేట్ అవార్డు రావడంపై ఆచార్యులు, పరిశోధకులు, వైయస్సార్సీపి, తెలుగుదేశం పార్టీ, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ అనుబంధ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘ నేతలు మరియు బంధుమిత్రులు హర్ష వ్యక్తం చేశారు.