అల్లూరి జిల్లా, పాడేరు,ది రిపోర్టర్ న్యూస్ :2022-2023 విద్యా సంవత్సరంలో 11 మండలాల గిరిజన ప్రాంతంలో అధిక మార్కులు సాధించిన గిరిజన విద్యార్థిని విద్యార్థులకు లోకుల గాంధి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ 15వేల రూపాయలను జిల్లా కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చేతుల మీదుగా 11 మండలాల టాపర్స్ కి మరియు సెకండ్ టాపర్స్ కి తోడు సంస్థ ఆధ్వర్యంలో నగదుతో పాటు మెడల్, మెరిట్ సర్టిఫికెట్ జిల్లా కలెక్టర్ మరియు అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ చేతుల మీదుగా బహూకరించడం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… తోడు ది లోకులగాంధి ట్రస్ట్ చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ కొనియాడారు. అదే విధంగా యువత చెడు మార్గాల్లో పయనించకూడదు ప్రతీ విద్యార్థి ఒక లక్ష్యం నిర్దేశించుకోవాలని సూచించారు. విద్య మాత్రమే మనిషి యొక్క జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని, లోకుల గాంధిని గిరిజన విద్యార్థిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, విద్యార్థిని విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి, అరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ… లోకుల గాంధిని స్ఫూర్తిని తీసుకుని, తోడు సంస్థ సహకారాన్ని అందిపుచ్చుకుని, గిరిజన విద్యార్థిని విద్యార్థులు ఉన్నతమైనటువంటి చదువులు చదవాలని, ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అల్లూరి జిల్లా బిజెపి అధ్యక్షులు పాంగి రాజారావు, పాడేరు బిజెపి అసెంబ్లీ కన్వీనర్ కూడా కృష్ణారావు, తోడు సంస్థ చైర్మన్ డాక్టర్ లోకుల రమేష్, ప్రధాన కార్యదర్శి మఠం మురళీ కృష్ణ, గౌరవాధ్యక్షులు లోకుల కిరణ్ మాష్టారు, గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు, కొయ్యూరు మండలం బిజెపి నాయకులు మురుకుర్తి అప్పలరాజు, రీమల చందర్రావు, అరిమెల రాజు, దుక్కెరి ప్రభాకర్, మచ్చల మంగతల్లి, సంపరి శివ, తోడు ట్రస్ట్ సభ్యులు అజయ్, అర్జున్ రెడ్డి, చలం, అప్పారావు, శెట్టి దిలీప్ కుమార్, నాని, మాష్టారు, విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.