గంటన్నదొర ఆశయాలు కొనసాగిస్తామని ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఏసి నాయకులు అన్నారు.మండలంలోని రింతాడ సమీపంలో గల టేకు తోటలో ఆదివాసీ పోరాటయోధుడు,స్వాతంత్ర్యసమరయోధుడు గాంగంటన్నదొర 99వ వర్ధంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బ్రిటీష్ సామ్రాజ్యవాదుల్ని ఎదురు నిలిచి చివరి వరకు పోరాడి ప్రాణాలర్పించిన గంటన్నదొర చిరస్మణీయుడని,ఆయనతో పాటు వందల మంది ఆదివాసీ పోరాట యోధులు ప్రాణాలర్పించారని,కొంతమందిని కారగారశిక్ష విదించారని,ఈ పోరాటంలో పాల్గొన్న యోదులందరి ఆశయాల కోసం ఆదివాసీ జెఏసి పోరాడుతుందని,ఈ మన్యం పోరాటాన్ని జాతీయపోరాటంగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ,గాం సోదరుల కుటుంబాలకు ఇళ్ల పట్టాలిచ్చిన ప్రభుత్వాలు ఇళ్లు మాత్రం ఇవ్వలేదని,అంగరంగ రంగ వైభవంగా చింతపల్లిలో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్ర,రాష్ట్ర మంత్రులు గాం సోదరుల కుటుంబాలకు ఇల్లు ఇస్తామని చెప్పి,వారి భూమిలో వారికే పట్టాలిచ్చి మరిచిపోయారని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జెఎసి రాష్ట్ర వైస్ చైర్మన్ మొట్టడం రాజబాబు,కార్యదర్శి సొనియ గంగారాజు,జిల్లా కన్వీనర్ రామరావుదొర,రింతాడ ఉపసర్పంచ్ మరియు జికె వీధి మండల ఆదివాసీ జెఏసి కోశాధికారి మడపల సోమేష్ కుమార్,అఖిల భారతీయ ఆదివాసీ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు చిట్టపులి శ్రీనివాస్ పడాల్,అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లోచల రామక్రిష్ణ,జిల్లా అధ్యక్షులు ముఖి శేషాద్రి,చింతపల్లి మండల అధ్యక్షులు బౌడు గంగారాజు,ఉపాధ్యాయులు వంజరి శ్రీనువాస్,రౌతుల విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.