contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ మీద తప్పుడు ప్రచారాలు మానుకోవాలి

  • కులం పేరుతో ఎవరికి మస్టర్లు వెయ్యట్లేదు. ఫీల్డ్ అసిస్టెంట్.
  •  ప్రతి జాబ్ కార్డు కి 100 రోజులు పని దినాలు కల్పించటం ధ్యేయం.
  •  కొండపోడు పట్టాలు కలిగిన కుటుంబానికి 150 రోజులు పని దినాలు కల్పిస్తాం.

అల్లూరి జిల్లా: అనంతగిరి:ది రిపోర్టర్ న్యూస్ :మండలంలో గల కోనాపురం పంచాయతీ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ కిలో భగత్ రామ్ మీద తప్పుడు ప్రచారాలు మానుకోవాలని పంచాయితీ ఉపాధి హామీ కూలీలు తెలిపారు. పత్రికలలో గిరిజన ప్రాంతం మీద ఎటువంటి పట్టు లేకుండా సంఘటనలు సృష్టించి రాయడం సరికాదని తెలిపారు.0203006001/IF/GIS/979974 వర్క్ ఐడి శెట్టి జగన్నాథం గల భూమిలో ఉపాధి కూలీలు పనిచేస్తున్నామని, గిరిజన ప్రాంతంలో భూమి చదును వంటి పనులు చేపట్టినప్పుడు ఒకే ఐడీలో ఒకటి లేదా రెండు గ్రూపులు పనిచేయడం వాస్తవమని పని పూర్తయిన తర్వాత భూమి గలవారు తమకు సంతృప్తిగా ఏదో ఒకటి ఇవ్వడం సభమేనని ముష్య, రామచంద్ర, పంచాడి రఘునాథ్, తడబారీకి అప్పన్న, తేడాబారి సంజీవరావు , రామకృష్ణ కాంగ్రెస్ ( కార్యకర్త) తెలిపారు.

• కులం పేరుతో ఏ ఒక్కరిని వేరేగా చూడట్లేదు.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో కులానికి, మతానికి ఎటువంటి రిజర్వేషన్లు లేవని, జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్క కుటుంబానికి వంద రోజులు పని దినాలు కల్పించడం తమ బాధ్యత అని కొండపోడు పట్టాలు కలిగిన వారికి ప్రత్యేక దృష్టి పెట్టి 150 రోజులు పని దినాలు కనిపించేలా చర్యలు తీసుకుంటున్నామని ఫీల్డ్ అసిస్టెంట్ కిలో భగత్ రామ్ తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :