అల్లూరి జిల్లా,కొయ్యురు, ది రిపోర్టర్ :కొయ్యూరు మండలం, నడింపాలెం సమీపంలో బట్టపనుకుల పంచాయతీ పరిధిలోని 11 మంది స్వాతంత్ర్య సమర యోధుల కుటుంబ సభ్యులు నివసిస్తున్న లంకవీధి గ్రామంలో గాం గంటందొర విగ్రహాన్ని వైసిపి నాయకులు ఈ నెల 7 తారీఖున ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర్య సమర యోధుడు గాం గంటందొర గురించి ఉపన్యాసించడం మర్చిపోయి, వేదిక మీద నా కోసం ఉపన్యాసం చేయడం ఎంతవరకు సమంజసం? స్వాతంత్ర్య సమర యోధుల సంస్మరణ సభలో రాజకీయ చర్చలు చేసి, దేశం కోసం ప్రాణాలు అర్పించిన దేశ భక్తులను అవమానించడమే. ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా విమర్శలు వస్తూనే ఉంటాయని, అధికార పక్షాన్ని విమర్శలు చేసినప్పుడు తట్టుకునే శక్తి కూడా అవసరమని అన్నారు,
కొంతమంది బోగస్ వైసిపి నాయకులు పదవీ బాధ్యతలు స్వీకరించి, విలువలు లేని వాళ్ళు దేశ భక్తి కోసం, మాట్లాడడం విడ్డూరంగా ఉందని,స్వాతంత్ర్య సమర యోధుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తేనే దేశ భక్తి అవుతుందని అనడంలో అర్థం లేదన్నారు,
కష్టాల్లో బాధల్లో ఉన్నవారికి మన వంతు సహాయం చేయడం నిజమైన దేశ భక్తి అంతే తప్పితే పూలమాలలు వేసి నివాళులు అర్పించడం ఏ మాత్రం కాదని ఆరోపించారు,
మీకు స్వాతంత్ర్య సమర యోధుల కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్న లంకవీధి అనే గ్రామం ఎవరో చెబితే గాని తెలియదా,
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గరకు బోడిదొరను తీసుకెళ్ళింది ఎవరో మీకు తెలియదని అన్నారు,
క్షత్రియ సేవా సంఘం ప్రతినిధులు కొంతమంది శ్రమ ఫలితం మూలంగా 11 మంది కుటుంబ సభ్యులకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని తీసుకున్న నిర్ణయాన్ని కూడా వైసిపి నాయకుల కష్ట ఫలితం అని మీ ఖాతాలో వేసుకోవడం ప్రపంచంలో ఇంతకన్నా హాస్యం మరొకటి ఉండదని అన్నారు.
స్వాతంత్ర్య సమర యోధుల కుటుంబ సభ్యుల ఇళ్ల విషయానికొస్తే వైసిపి ప్రజాప్రతినిధుల ప్రమేయం శూన్యం. వేదికలపై మాత్రం డబ్బా వాయించడం ఇంతా అంతా కాదు.
మీరు బోగస్ గిరిజనుడు అయి ఉండి, మాట్లాడడం మీకు అర్హత లేదు. చిత్తశుద్ధి ఉంటే, పదవీ, బాధ్యతని రాజీనామా చేసి, అప్పుడు మాట్లాడితే, బాగుంటుందన్నారు.