మంచిర్యాల జిల్లా లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చెన్నూరు శాఖ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని.మీడియా సమావేశం నిర్వహించరు
ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మామిడి అక్షిత మాట్లాడుతూ.మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలు విద్యను వ్యాపారంగా మలుచుకుని పేద విద్యార్థులను మోసం చేస్తునారని. సరైన గుర్తింపులు లేకుండా చాలా పాఠశాలలు నడుస్తున్నాయని, కార్పొరేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తూ పేద విద్యార్థులను మోసం చేస్తున్నాయని. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని . సరైన సమయానికి పాఠశా పుస్తకాలు, దుస్తులు అందక విద్యార్ధులు ఇబ్బంది పడుతున్నారు. అని పాఠశాలలలో భోధన భోదనోతర ఉపాధ్యాయ ఖాళీలతో ఇబ్బందులు పడుతున్నరని అలాగే జిల్లా వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్స్ లో మౌళిక వసతులు కల్పించాలి. అలాగే విద్యారంగ సమస్యల పరిష్కరించాలని అన్నారు. అనుమతులు లేని ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని , నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసులు చేస్తున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలని, ప్రైవేటు పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, దుస్తువుల పేరుతో జరిగే వ్యాపారాన్ని అరికట్టాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌళీక వసతులు కల్పించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలను, దుస్తువులను సకాలంలో అందేవిదంగా చుడాలని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళిగా ఉన్న ఉపాధ్యాయ పోస్టలను భర్తీ చేయాలి. జిల్లా వ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టళ్ళలో మౌళిక వసతులు కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ABVP రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మామిడి అక్షిత నాయకులు సిద్దు రాజు, సాయి, రమ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు
