కరీంనగర్ జిల్లా: బిజెపి నాయకులు వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదని బిఆర్ఎస్ నాయకుడు న్యాత సుధాకర్ అన్నారు. ఈ సందర్భంగా గన్నేరువరం మండల కేంద్రంలో బిఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో ఎన్నడలేని విధంగా అభివృద్ధి పనులు చేపట్టామని. త్వరలో మరిన్ని పనులు కూడా చేపడతామని తెలిపారు. దాడులు చేసే సంస్కృతి మాకు లేదని, విమర్శించే ముందు ఆత్మ పరిశీల చేసుకోవాలని కోరారు. ఎంపీగా బండి సంజయ్ గత ఐదేళ్లలో మండలంలో ఏమి అభివృద్ధి చేపట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొంది వారిని విమర్శించడం తగదన్నారు. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు కొట్టే భూమయ్య, శంకర్ గౌడ్, బుర్ర మల్లేశం గౌడ్, అటికం రవి గౌడ్, నక్క దామోదర్, బోయిని కుమార్, బోయిని బాలయ్య, మహంకాళి ప్రభాకర్, మల్లయ్య, కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.