- అనంతగిరిలో జగనన్న విద్యా కానుకలను పంపిణీ చేసిన ఎంపీపీ శెట్టి నీలవేణి.
అల్లూరి జిల్లా,అనంతగిరి,(ది రిపోర్టర్ ) :ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న చిన్నారులకు సఖల సదుపాయాలు కల్పించడంతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మదిలో నుంచి వచ్చిన వినూత్న ఆలోచన విద్యా కానుక . కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సరఫరా చేసిన జగనన్న విద్య కానుక కిట్లను అనంతగిరి మండల కేంద్రంలో ఎంపీపీ శెట్టి నీలవేణి మండల పరిధిలోని పలువురు సర్పంచులు ఎంపీటీసీల తో కలిసి విద్యార్థులకు అందజేశారు. 9 రకాల వస్తువులతో కూడిన జగనన్న కిట్ల పంపిణీ తో విద్యార్థుల ముఖంలో ఆనందం నెలకొంది.థాంక్యూ సీఎం సార్ అంటూ విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపార…