కర్నూల్ జిల్లా ఆదోని మండలం దిబ్బనకల్ లో గత రెండు రోజులుగా సిగ్మా రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ ఏజెన్సీ ఆధ్వర్యంలో ముగ్గురూ సభ్యుల బృందంతో కుటుంబ అరోగ్య సర్వే నిర్వహించారు. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ (IIPS) ముంబై, ద్వారా క్షేత్రస్థాయి కార్యాచరణను నిర్వహిస్తోంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో SIGMA రీసెర్చ్ కన్సల్టింగ్ Pvt., Ltd, న్యూఢిల్లీ అనే ఫీల్డ్ ఏజెన్సీ సహకారంతో నిర్వహించడం జరుగుతుంది.ఏజెన్సీ రెండు దశల్లో క్షేత్రస్థాయిలో పనులు చేపట్టనుంది. ఫీల్డ్ వర్క్ యొక్క మొదటి దశ ఎంపిక చేయబడిన నమూనా గ్రామం(లు)/పట్టణంలోని ఇంటి మ్యాపింగ్ మరియు జాబితాను కలిగి ఉంటుంది. బ్లాక్(లు) ఇది నిర్దేశిత సర్వే షెడ్యూల్లలో సమాచారాన్ని సేకరించేందుకు కుటుంబాల ఎంపిక కోసం ఒక ఫ్రేమ్‌గా పనిచేస్తుంది.సర్వే చేసిన నమోదు చేసిన నివేదికను IIPS కు అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సర్వే సభ్యులు. సూపర్వైజర్ సాగర్, కె నూకరాజు, దేముడు తో పాటు ఎం ఎల్ హెచ్ పి పవిత్ర, ఎ ఎన్ ఎం లక్ష్మి , ఆశా వర్కర్లు బి సులోచన,పి బజరమ్మా తదితరులు పాల్గొన్నారు