తిరుపతి జిల్లా గూడూరు లో ఆం.ప్ర ఎరుకుల ప్రజా సంక్షేమ సేవ సంఘాం నూతన రాష్ట్ర వైస్ చైర్మన్ తోకల నాగభూషణం కు ఘనంగా సన్మానం జరిగినది. ముందుగా గూడూరు పట్టణంలో అంభేడ్కర్ విగ్రహనికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి పట్టణం లో ర్యాలీ గా బయలుదేరి స్థానిక టిడిడి కళ్యాణ మండపం నందు సభకు వందలాదిగా రావడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఏకలవ్య విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు. APYPSS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవరకొండ శంకర్ అధ్యక్షతన నూతనంగా ఎన్నుకైనటువంటి APYPSS రాష్ట్ర వైస్ చైర్మన్ తోకల నాగభూషణం కు ఘనంగా సన్మానించడం జరిగినది.
తోకల నాగభూషణం మాట్లాడుతూ మన ఏపీ లో గిరిజనులకు చాలా అన్యాయం జరుగుతుందన్నారు.
ఈ నాలుగు ఏళ్ల లో మా యస్టీ లకు ఏమీ చేశారని ప్రశ్నించారు. రాజ్యంగబద్ధమైన యస్టీ సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగం చేశారు.గిరిజనుల గ్రామాల అభివృద్ధి లేదు.టెన్త్ ఫలితాలలో సుమారు 30 గురుకుల పాఠశాలలో 0 % రిజల్ట్ వచ్చింది. సరైన విద్య ను గిరిజన విద్యార్థులకు ఇవ్వడం లో విఫలమయ్యారు ఈ ప్రభుత్వం. కొత్తగా జీవో నెం.52 ను తెచ్చి అభివృద్ధి చెందిన బీసీ కులాలను మా ఎస్టీ లలో కలపడం దారుణమన్నారు.మా గిరిజన హక్కులను ఎవరైనసరే కాలరాస్తే చూస్తూ ఊరుకోము రాష్ట్రం మొత్తం ఉద్యమిస్తాంమని తోకల నాగభూషణం హేచ్చరించారు…
ఈ కార్యక్రమంలో APYPSS రాష్ట్ర అధ్యక్షులు సాకే చిరంజీవి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కిరణ్ కుమార్,రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ జగదీష్, రాష్ట్ర మహిళా కార్యదర్శి సభ్యురాలు సాకే చంద్రకళ మరియు APYPSS కుటుంబసభ్యులు పాల్గొనడం జరిగింది.