- పాల్గొన్న కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ
- ఎవరికి న్యాయం జరిగిందని ఈ దశాబ్ది సంబరాలు జరుపుతున్నారు..?
- పంట నష్ట పోయిన రైతులను పరామర్శించలే … నష్టపరిహారం అందించలేదు
- అకాల వర్షాలతో వరదలు వడగండ్లతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
- కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు ఇప్పటికి ఇంకా రైతులకు చెల్లించలేదు కానీ సంబరాల పేరుతో వందల కోట్లు ఖర్చు…?
కరీంనగర్ జిల్లా: తెలంగాణ ప్రజానీకానికి ఏం న్యాయం జరిగిందని దశాబ్ది సంబరాలు జరుపుతున్నారని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పల్లే పల్లెకు కవ్వంపల్లి గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా మానకొండూరు నియోజవర్గం శంకరపట్నం మండలం మెట్ పల్లి గ్రామంలో రెండో రోజు పర్యటించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు గడిచిన ఆ సంతోషం తెలంగాణ ప్రజానీకానికి మిగలలేదని అన్నారు. 9 ఏళ్లు అయినా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు మారలేదని అన్నారు.నీళ్లు,నిధులు,నియామకాలు అని మాయ మాటలు చెప్పి, తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు చేసింది ఏమి లేదన్నారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఇన్ పుట్ సబ్సిడీ, పనిముట్ల పై సబ్సిడీ ఇవ్వకుండా రైతులకు తీవ్ర నష్టం చేస్తుందని అన్నారు.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే ఏక కాలంలో రూ. 2 లక్షల రైతు రుణ మాఫీ చేస్తాం అని, రూ. 500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, సొంత స్థలంలో ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షల సాయం చేస్తామని, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని, ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే కనీస పించన్ రూ. 5000 ఇస్తామని, అధికారం లోకి వచ్చిన మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని, అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని, భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు ఎకరానికి రూ. 15 వేల సాయం, భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు రూ. 12 వేల సాయం అందిస్తామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనీ అధికారం లోకి తీసుకువచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నేరవేర్చిన సోనియా గాంధీ ఋణం తీర్చు కోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గోపగోని బస్వయ్య, మాజీ సర్పంచ్ పోచయ్య గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్, నాయకులు గట్టయ్య, శ్రీనివాస్ రెడ్డి, ఓదెలు, శ్రీనివాస్, రవి, ఓంకార్ కార్యకర్తలు పాల్గొన్నారు.