తిరుపతి- కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను మర్యాద పూర్వకంగా కలిసారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, రాష్ట్ర నందీఅవార్డు గ్రహీత చక్రధర్ సిద్దాంతి.తిరుపతికి విచ్చేసిన గోయల్కు పుష్పగుచ్చాలు అందించి,వేదాశీర్వచనం చేసారు. మొన్న ముంబైలో జ్యోతిష్య చక్రవర్తి, అమెరికన్ డాక్టరేట్ అందుకున్న చక్రధర్ సిద్దాంతిని ఈ సందర్భంగా అభినందించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్…,చక్రధర్ లాంటి జ్యోతిష్య నిపుణులు సమాజానికి అవసరమన్నారు. వారి జ్ఞాన సంపద భావితరలకు అందాలనీ,ఆదిశగా చక్రధర్ కృషి చేయాలని గోయల్ సూచించారు.అంతేకాక జ్యోతిష్య పండితులకు మోదీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన చెప్పారు.