contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మైనింగ్ మాఫియాకు అనుమతులు ఎవరిచ్చారు? :

  • రింతడా కొండపై నల్లరాయి తరలింపుకు మైనింగ్ మాఫియాకు అనుమతులు ఎవరిచ్చారు.
  •  ఆదివాసీ ఐక్య మేధావుల వేదిక స్టేట్ సెక్రెటరీ బోండ్ల చిరంజీవి ప్రశ్న…?

అల్లూరి జిల్లా,గూడెం కొత్తవీధి: అల్లూరి సీతారామరాజు జిల్లా, గూడెం కొత్త వీధి మండలంలోని రంతాడ గ్రామపంచాయతీ రింతాడా గ్రామానికి వెనకాల వున్న కొండపై నల్లరాయి తరలింపుకు మైనింగ్ మాఫియాకు అనుమతులు ఎలా వచ్చాయి ఎవరిచ్చారు అని ఆదివాసీ మేధావుల ఐక్య వేదిక రాష్ట్ర కార్యదర్శి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు చిరంజీవి ప్రశ్నించారు. ఇదే ప్రాంతంలో చట్టపరమైన కార్యకలాపాలపై నిర్ణయాలు తీసుకోవాలన్న గ్రామస్థుల అంగీకారం వుంటుంది. అలాంటిది పిసా కమిటీ గ్రామసభ పంచాయితీ తీర్మానాలు లేకుండా ఎవడబ్బ సొత్తు అని మైనింగ్ మాఫియా నల్లరాయి క్వారీ తవ్వకాలకు ప్రయత్నిస్తోందoటు చిరంజీవి మండిపడ్డారు, ఇంతకు మీకు పర్మిషన్లు ఎవరిచ్చారు 5 షెడ్యూలుప్రాంతాలలో ఎక్కడైనా అడవి,చెట్టు,చెమా, అన్ని గిరిజనుల అధీనంలో హక్కుకలిగి వున్నాయి చివరకు ఇక్కడ మట్టి రెనువుకుడ గిరిజనులదే అందులో అటవీ ప్రాంగణంలో వున్నరాయిని 2006 అటవిహక్కు చట్టాన్ని ఉల్లంఘించి అనుమతులు ఎలా ఇస్తారో రెవెన్యూ ఫారెస్ట్ శాఖ అధికారులు వివరణ ఇవ్వాలి మా కొండలలో మేమే ఒక కట్టేకానీ ఇళ్లు కట్టుకుందామని రాయిగాని తెచ్చుకుంటే నానా ఇబ్బందులు. ఏళ్లతరబడిఅడవులను రక్షించుకుంటు అడవిలో మమేకమై జీవనం సాగిస్తున్నాది గిరిజనులు అలాంటిది 20 సంవత్సరాలుపైబడి పొడు వ్యవసాయం చేస్తున్న పట్టాలివ్వకుండ ఎన్నోఆంక్షలు గిరిజనుల జీవనఉపాధి విధానాన్ని గండికొట్టి చట్టాలను వ్యతిరేకించి ఒకవేళ మైనింగ్ మాఫియా బడాబాబులు అనుమతులు ఇస్తేఊరుకోo ఇదే నల్లారికల్గిన కొండ చుట్టుప్రక్కల 5,6 గ్రామాలను అనుకునివుంది ఇకొండలో రంగురాళ్ల ఉన్నాయనే విషయం ప్రస్తావనకు వుంది గతకొద్ది రోజల్లోతవ్వకాలు కూడా జరిగాయి అందుకే మాఫియా రాయికి అనుమతివస్తే కొండ తవ్వుటకు ప్రత్నిస్తోంది సంపద వుందని గమనించిన మాఫియా కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు రాయినితవ్వి సంపద తీయాలని చూస్తున్నారు రాయి కాదు కదా కొండలో చిన్నపిక్కరాయి కూడా తీయకుండా ఆదివాసీ సంపద. చట్టాల కాపాడుకోవడంలో ఆదివాసీ నాయకులంతా మాఫియాను అడ్డుకుంటాం ఉద్యమిస్తాo అని ఆదివాసీ ఐక్య మేధావుల వేదిక ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ సెక్రెటరీ అలాగే బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బోండ్ల చిరంజీవి హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :