అల్లూరి జిల్లా, ముంచంగి పుట్ : అల్లూరి జిల్లా,ముంచంగిపుట్ మండలం పరిధిలో గల లుంగాపుట్ లో పాడేరు ఐటిడి ఆధ్వర్యంలో రూ.75 లక్షలతో నూతనంగా నిర్మించిన హెచ్పి పెట్రోల్ బంకులు ఇప్పుడు వారం కాకుండానే నో స్టాక్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. లుంగాపుట్ లో నిర్మించిన నూతల పెట్రోల్ బంకును ఈనెల 8వ తారీఖున అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎంతో ఆర్భాటంగా ప్రారంభించి.. కనీసం వారం రోజులు కూడా కాకుండానే..పెట్రోల్ డీజిల్ అందుబాటులో లేకపోవడం, నో స్టాక్ బోర్డులతో మూతపడి ఉండడాన్ని చూసి వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రానికి సమీపంలో నూతన బంకు ప్రారంభమైందని వాహనదారులు సంతోష పడినప్పటికీ, పెట్రోల్, డీజిల్ కొరకు నూతన బంకుకు వెళ్ళిన వాహనం వాహనదారులకు నిరాశ మిగులుతుంది.ఐటీడీఏఅధికారులు తక్షణమే స్పందించి నూతన పెట్రోల్ బంకులో పెట్రోల్ డీజిల్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని వాహన దారులు కోరుతున్నారు.