- అమ్మ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
కరీంనగర్ జిల్లా: కేంద్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు జి.కిషన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని కరీంనగర్ పట్టణంలో బిజెపి రాష్ట్ర నాయకురాలు అమ్ము స్వచ్చంద సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ పి.సుజాత రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు మరియు వారి అటెండెట్లకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సంధర్భంగా సుజాత రెడ్డి మాట్లాడుతూ కిషన్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని రాజకీయంగా ఇంకా ఎన్నో ఉన్నత పదవులు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో అరుణ, బిజెపి నాయకులు సుమన్. శ్రీసాయి వెంకటశ్ కార్యకర్తలు పాల్గొన్నారు.