- జీ తెలుగు డ్రామా జూనియర్స్ లో చిన్నారి ఆధ్యాకు అవకాశం
- కరీంనగర్లో మాస్క్ యాక్టింగ్ ఇన్ స్టీట్యూబ్ లో శిక్షణ
- అన్నపూర్ణ స్టూడియోలో ఫైనల్ సెలక్షన్ లో ఎంపిక
- ఈ ఆదివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగులో ప్రసారం
కరీంనగర్ జిల్లా: పట్టణంలోని భగత్ నగర్ కి చెందిన చిన్నారి కొండకింది ఆధ్యారెడ్డి జీ తెలుగు డ్రామా జూనియర్స్ సీజన్ 6లో అవకాశం దక్కించుకొని రెండు సంవత్సరాలు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. తల్లిదండ్రులు శశిధర్ రెడ్డి ప్రియాంక ప్రోత్సాహంతో కరీంనగర్ లోని మాస్క్ యాక్టింగ్ ఇన్ స్టి ట్యూబ్ లో చేరి నటశిక్షకుడు దర్శకుడు అనసూరి భూనాథ చారి వద్ద నటనలో మెలకువలు నేర్చుకుంది. హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఫైనల్ సెలక్షన్ లో ఎంపికయింది. సీనియర్ నటి జయప్రద, బాబు మోహన్, శ్రీదేవి జడ్జిలుగా వ్యవహరించిన గ్రౌండ్ ఫైనల్ లో అద్భుతమైన నటనను ప్రదర్శించి. వారి మన్నునలు పొంది. అవకాశం అందుకొని ఈ ఆదివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగులో సీతాదేవి పాత్రలో మన ముందుకు రాబోతున్న ఆధ్యా రెడ్డికి పలువురు కళాకారులు, మిత్రులు, బంధువులు, అభినందనలు తెలియజేశారు. పదేండ్ల వయసులోనే మంచి అవకాశం పొందిన చిన్నారి భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు.