కరీంనగర్ జిల్లా:మానకొండూరు మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ గడ్డం నాగరాజు నివాసములో ముఖ్య కార్యకర్తల సమావేశం సభ అధ్యక్షత జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణ్ వాసుదేవ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ మానకొండూరు లో కె.ఎస్.ఆర్ ఫంక్షన్ హాల్లో
శనివారం ఉదయం 10 గంటలకు జరగబోయే భారతీయ జనతా పార్టీ ఏడు మోర్చాల సమావేశానికి నియోజవర్గంలోని ఆరు మండలాల నుంచి భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి మానకొండూరు అసెంబ్లీ నియోజవర్గ ఇన్చార్జి గడ్డం నాగరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, సొల్లు అజయ్ వర్మ, మాడ వెంకట్ రెడ్డి, గుర్రాల వెంకటరెడ్డి, రంగు భాస్కరాచారి, రాజిరెడ్డి, జాడి బాల్ రెడ్డి, తిప్పర్తి నికేష్, శంకరాచారి, ఎర్రోజు లక్ష్మణ చారి, బాసబోయిని ప్రదీప్ యాదవ్, శ్రీనివాస్, ఆంజనేయులు పటేల్, రమేష్, అడప రవి, లడ్డు తదితరులు పాల్గొన్నారు.