సిద్దిపేట జిల్లా: బెజ్జంకి మండల కేంద్రానికి దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పర్యటనకు వస్తున్న రాష్ట్ర ఆర్థిక మరియు ఆరోగ్యశాఖ మంత్రి పర్యటన సందర్భంగా మండలంలో ఉన్న అనేక సమస్యలతో పాటు గతంలో మంత్రి పర్యటనలో ఇచ్చిన హామీలను నెరవేర్చని సందర్భంగా అలాగే, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఇస్తానన్న నిధులు మరి మా మండలానికి వంద పడకల ఆసుపత్రిలో గల్లి గల్లి సిసిరోలు ఎక్కడ వాయే ఇకనైనా మరోసారి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చగలరని మీరు వచ్చినప్పుడల్లా ఈ అక్రమ అరెస్టులు వెంటనే విరమించుకోవాలి బిజెపి మండల శాఖ తరుపున ప్రశ్నించినందుకు స్థానిక బిజెపి నాయకులను అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి దొంతర వేణి శ్రీనివాస్ యాదవ్ పట్టణ అధ్యక్షుడు సంఘ రవి యాదవ్ మరియు ముదిరాజ్ సంఘం మత్స్యశాఖ వైస్ చైర్మన్ బర్ల రాజు బిజెపి మండల నాయకులు తదితరులు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు.