కరీంనగర్ జిల్లా: పల్లె పల్లెకు కవ్వంపల్లి – గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో డిసిసి అధ్యక్షులు మానకొండూరు నియోజవర్గ ఇన్చార్జి కవ్వంపల్లి సత్యనారాయణ రెండో రోజు పాదయాత్ర చేస్తూ ఈ భరసా.బీజేపీ ప్రభుత్వాల నిరంకుశ పాలన వైఖరిని ప్రజలకు వివరిస్తూ, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలు, హామీలు 500 /-రూపాయలకే గ్యాస్, రైతులకు ఏకకాలంలో 2,00,000 /- లక్షలు రుణ మాఫీ, కొత్తగా ఇల్లు కట్టుకునేందుకు 5,00,000/- లక్షలు,మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం కలిపిస్తామని అలాగే నిరుద్యోగ యువతకు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.