అల్లూరి జిల్లా, అనంతగిరి: అరకు నియోజకవర్గ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నాడు నియోజకవర్గ ప్రధాన కూడలి వద్ద బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పూరందేశ్వరి, అరుకు పార్లమెంట్ కన్వీనర్ కొత్తపల్లి గీత నేతృత్వంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు జిల్లా అధ్యక్షుడు పాంగీ రాజారావు, అరుకు నియోజకవర్గ కో కన్వీనర్ శెట్టి రాజు పాత్రికేయులకు తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ అరకులో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. బహిరంగ సభ పిలుపు మేరకు ప్రధాని నరేంద్రమోడీ పాలన విజయాలు 9 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా, అభివృద్ధి, ప్రజా సంక్షేమంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విదానాలను భారీ భహిరంగ సభ ద్వారా ప్రజలకు నేరుగా తెలియజేసేందుకు జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే పార్లమెంట్ కన్వీనర్లు పిలుపునిస్తున్న సందర్భంగా అభిమానులు, మేధావులు, యువకులు, మహిళామణులు, బూత్ స్థాయినుండి నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో యువమోర్చా ప్రధాన కార్యదర్శి సమరెడ్డి రామస్వామి, పాంగి నాగేశ్వరరావు, వంతల అప్పన్న, సిరగం రామకృష్ణ, సిరగం రాంప్రసాద్, అడ్డాల సోమరాజు పలువురు పాల్గొన్నారు.