- రాష్ట్ర వ్యాప్తంగా ” ఏకలవ్యుడు” జయంతి వేడుకలకు సన్నాహాలు – డా. కొండారెడ్డి నరహరి వరప్రసాద్
జూన్ 29 వ తేదిన తొలి ఏకాదశి పండుగ రోజున అంగరంగ వైభవంగా ” ఏకలవ్య” మహరాజ్ జయంతి వేడుకలు జరుగుతాయిని మాజీ SC, ST కమిషన్ మెంబర్ డా!! కొండారెడ్డి నరహరివర ప్రసాద్ తాడేపల్లి తెలుగుదేశం పార్టీ కార్యలయం నందు పాత్రికేయుల సమావేశంలో పేర్కొన్నారు.విలు విద్యలో ప్రపంచం లో మేటి అయిన ఏకలవ్యుడు వారసులు ఎరుకుల జాతి బిడ్డలు తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటారన్నారు.ఆనాడు ఎన్టీఆర్ కుడు,గుడ్డ, నీడ,ఎరుకులను సంక్షేమ పధకాలతో మా బ్రతుకులు మార్చింది ఒక్క తెలుగుదేశం పార్టీనే అని గుర్తుచేశారు.అదే తరహాలో నారా చంద్రబాబు నాయుడు హయాంలో ఎరుకులకు అన్ని రంగాలలో పెద్దపీట వేశారన్నారు.నేడు ఈ వైసీపీ పాలన లో మా గిరిజనులకు సంక్షేమ పధకాలు రద్దు చేసి, పేరుకు మాత్రమే పదవులు కట్టబెట్టి గిరిజన బిడ్డల నోర్లు ముయించినారు.అబద్దాలు హామీలు ఇచ్చి ఈ జగన్ రెడ్డి గిరిజన కుటుంబాలను నట్టేట ముంచాడు.2024 లో మా గిరిజనులు అందరు ఏకమై వైసీపీ ని గద్దె దించుతామని హెచ్చిరికలు జారీ చేస్తున్నామన్నారు.
ఈ మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర నాయకులు ఇట్టా. భాస్కర్,
తోకల నాగభూషణం,చినుకుని విజయమ్మ, ఉయ్యాల శ్రీనివాస్,ఏపీవైపియస్ ఎరుకుల సంఘాల నాయకులు దేవరకొండ శంకర్ రావు,గరిక శ్రీనివాస్,తోకల కోటేశ్వరరావు, సాలే మల్లేశ్వరరావు, బండి రాజేష్, మేడా రామకృష్ణ తదితరనాయకులు పాల్గొన్నారు.