కరీంనగర్ జిల్లా: పార్లమెంట్ ఎన్నికల సమయంలో మానేరు డ్యామ్ నుంచి గన్నేరువరం వరకు బ్రిడ్జి నిర్మిస్తానని బండి సంజయ్ హామీ ఇచ్చి మార్చారాన్ని బ్రిడ్జి సాధన కమిటీ అధ్యక్షుడు సంపత్ ఉదయ్ కుమార్ ఆరోపించారు. ఆదివారం మానేరు పరివాహక ప్రాంతం మైసమ్మ గుట్ట ప్రాంతంలో వివిధ గ్రామాల ప్రజలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. బ్రిడ్జి లేని కారణంగా కరీంనగర్ వెళ్లాలంటే 45 కిలోమీటర్లు అద్వాన రోడ్డు మార్గంలో ప్రయాణం చేయాల్సి వస్తుందన్నారు. సమయానికి వైద్యం అందని పరిస్థితి ఏర్పడిందన్నారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే బెజ్జంకి ,ఇల్లంతకుంట, గన్నేరువరం మండలాలకు చెందిన 100 గ్రామాల ప్రజలకు కరీంనగర్ దగ్గరవుతుందన్నారు. బ్రిడ్జి నిర్మిస్తామంటేనే డ్యామ్ ముప్పు ప్రాంతానికి గురైన గ్రామాల ప్రజలు వేల ఎకరాలు భూములు ఇచ్చారని ఆ తర్వాత అప్పటినుండి ఇప్పటివరకు బ్రిడ్జి గురించి పట్టించుకునే నాధుడే కరువయ్యారని అన్నారు. బ్రిడ్జి నిర్మిస్తానని చెప్పడంతో నమ్మి ఓటేశారని ఎంపీగా గెలిచిన తర్వాత అడిగితే టిఆర్ఎస్ ప్రభుత్వం అప్రూవల్ ఇవ్వడం లేదని ఎంపీ బండి సంజయ్ తెలిపారనీ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చొరవ తీసుకొని బ్రిడ్జి నిర్మాణానికి .రాష్ట్ర ప్రభుత్వం నుండి అప్రూవల్ ఇప్పించి బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేయాలన్నారు. లేనిపక్షంలో ఎమ్మెల్యే ఎంపీలను మండలంలో తిరగనివ్వమని రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహేందర్ కుమ్మరి రమేష్, నవ్వుండ్ల కొమురయ్య, సంపతి రాములు, సంపతి మహేందర్, సురేష్, లక్ష్మణ్, బాలయ్య, కిట్టు, అజయ్, అన్వేష్ వివిధ గ్రామాల నుంచి ప్రజలు పాల్గొన్నారు.